ఏపీలో ఒకో మంత్రిది ఒకో తీరు అన్నట్లుగా ఉంది. ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో ఉన్న మంత్రులు పనితీరులో ఎంత హైలైట్ అవుతున్నారో తెలియడం లేదు గానీ....ప్రత్యర్ధులని తిట్టడంలో బాగా హైలైట్ అవుతున్నారు. అలాగే మరికొందరు ఏమో వివాదాల్లో చిక్కుకుని హైలైట్ అవుతున్నారు. అందరిదీ ఒక దారి అనుకుంటే...మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిది ఒక దారి అన్నట్లు ఉంది. ఈయన సడన్‌గా ఎంట్రీ ఇచ్చి ట్విస్ట్‌లతో హైలైట్ అవుతున్నారు.

అసలు చాలాకాలం నుంచి మంత్రివర్గంలో మార్పులు విషయంలో అనేక చర్చలు నడుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి 50 శాతం మార్పులు జరగొచ్చని, కాదు కాదు 80 శాతం అని ఒకసారి, మరొకసారి ఏమో 90 శాతం అంటూ ప్రచారం జరిగింది. కానీ సడన్‌గా బాలినేని మీడియా ముందుకొచ్చి 100 శాతం మార్పులు జరుగుతాయని కొత్త ట్విస్ట్ ఇచ్చారు. జగన్ తనతో స్వయంగా చెప్పారని, ఈ సారి పూర్తిగా మంత్రివర్గంలో మార్పులు జరుగుతాయని చెప్పారు. అంటే ఇప్పుడున్న మంత్రులంతా సైడ్ అయిపోయి...కొత్త మంత్రులు రానున్నారని చెప్పారు.

కానీ ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు జరగలేదు...ఎప్పుడు జరుగుతుందో తెలియడం లేదు. మరి ఎప్పుడు జరిగిన బాలినేని చెప్పినట్లే జరుగుతుందో లేదో చూడాలి. ఇలా క్యాబినెట్ విషయంలోనే ట్విస్ట్ ఇచ్చారనుకుంటే...తాజాగా మూడు రాజధానుల విషయంలో మరొక ట్విస్ట్ ఇచ్చారు. అసలే అమరావతిని ఆపి...జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ ఆ మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ట్విస్ట్ ఇచ్చారు.

సరే అమరావతి రాజధానిగా కంటిన్యూ అవుతుందా అనుకునే లోపు...ముందు పెట్టిన బిల్లులో లోపాలు ఉన్నాయని, ఆ లోపాలని సరి చేసి మళ్ళీ కొత్త బిల్లులతో ముందుకొస్తామని చెప్పి మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు. కానీ ఈ బిల్లులు ఎప్పుడు వస్తాయో చెప్పలేదు. కానీ తాజాగా బాలినేని...మళ్ళీ మూడు రాజధానుల బిల్లు మార్చిలో శాసనసభ ముందుకొస్తుందని చెప్పారు. ఇలా షాకింగ్ ట్విస్ట్‌లు బాలినేని మాత్రమే ఇస్తున్నారు. మరి ఈయన ఇచ్చే ట్విస్ట్‌లు జరుగుతాయో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: