రాజకీయాల్లో అవకాశాలు అరుదుగానే వస్తాయనే చెప్పాలి...అలాంటప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. లేదంటే వృధా అయిపోతుంది. అలా మంచి అవకాశాలు వచ్చినప్పుడు టీడీపీ ఉపయోగించుకోలేక ఇబ్బందులు పడుతుందనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న రాజకీయాలని బట్టి చూస్తే....2019 ఎన్నికల్లో వైసీపీకి ఉన్న బలం...ఇప్పుడు కాస్త తగ్గినట్లే కనిపిస్తోంది...అలాగే టీడీపీ బలం కాస్త పెరిగిందనే చెప్పొచ్చు. కానీ పూర్తి స్థాయిలో కాదు...కొంతవరకు మాత్రమే టీడీపీకి అవకాశం వచ్చింది.

అయితే టీడీపీకి ఇప్పుడుప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ ఎంపీల పనితీరు పట్ల ప్రజలు పెద్దగా సంతృప్తిగా లేరనే చెప్పొచ్చు. ఇలాంటి సమయంలో టీడీపీ ఇంకా బలపడే ప్రయత్నాలు చేయాలి. కానీ అధినేత చంద్రబాబు ఆ దిశగా మాత్రం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు. చాలా పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి సరైన నాయకులు లేరు..అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటినుంచే సరైన నాయకులని పెడితే..వచ్చే ఎన్నికలనాటికి పార్టీకి ప్లస్ అవుతుంది. వైసీపీని ఢీకొట్టే అవకాశం దక్కుతుంది.

ముఖ్యంగా బాపట్ల, ఒంగోలు లాంటి పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తోంది. కానీ ఆ స్థానాల్లో టీడీపీకి నాయకులే లేరు. అసలు ఒంగోలు ఎలాగో మొదట నుంచి టీడీపీకి అనుకూలం కాదు...కేవలం రెండుసార్లు మాత్రమే అక్కడ టీడీపీ గెలిచింది. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో  ఓడిపోవాల్సి వచ్చింది. అప్పుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈయన 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు...ఆ ఎన్నికల్లో టీడీపీ తరుపున శిద్ధా రాఘవరావు పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత ఆయన కూడా వైసీపీలోకి వెళ్ళిపోయారు.

దీంతో ఒంగోలు పార్లమెంట్‌లో టీడీపీకి నాయకుడు లేరు. ఇప్పటికీ అక్కడ పోటీ చేసే నాయకుడు ఎవరో క్లారిటీ లేదు. కనీసం బాబు ఇప్పటినుంచే మంచి నాయకుడుని పెడితే...ఒంగోలులో టీడీపీకి బెనిఫిట్ అవుతుంది. లేదంటే అంతే సంగతులు.  

మరింత సమాచారం తెలుసుకోండి: