జవాద్‌ తుపాన్ తాజాగా మరింత బలపడుతున్న‌ది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర తీరానికి  అతి స‌మీపంలోనే  చేరువకు తుపాన్‌ కేంద్రీకృతమై ఉంది.  విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు  ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో జవాద్‌ తుపాన్‌ కేంద్రీకృతమైన‌ది. ఉత్తర దిశగా కుదులతున్న తుపాను ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉన్న‌దని వాతావరణశాఖ అధికారులు అంచెనా వేస్తున్నారు. ప్రస్తుతం తుపాన్‌ గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న‌ది.  తుపాన్‌ ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న‌దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

తుపాన్‌ తీరానికి దగ్గరగా వచ్చే సమయంలో 100 కిలోమీట‌ర్ల‌ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఇప్ప‌టికే అధికారులు వెల్ల‌డించారు. తుపాన్‌ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ సునంద జోవాద్‌ తుపాన్  గురించి మాట్లాడుతూ పశ్చిమ వాయవ్యదిశగా ప్రయాణిస్తున్న తుపాను ఉత్తరకోస్తా జిల్లాలకు దగ్గరగా రావొచ్చు అని. ఆ త‌రువాత  ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించే అవకాశాలున్నాయి. ఫలితంగా శనివారం కోస్తాంద్రాలో ఓ మోస్తరు వర్షాలు కురవవ‌చ్చ‌ని చెప్పారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒకటి రెండుచోట్ల అత్యంత భారీవర్షాలు పడతాయ‌ని  తెలిపారు.


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆదివారం వ‌ర‌కు ఇప్ప‌టికే సెల‌వులు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌ల‌ను త‌రలించేందుకు ముఖ్యంగా 21 పున‌రావాస కేంద్రాల‌ను ఏర్పాటు చేసారు అధికారులు. అత్య‌వ‌స‌ర సేవ‌ల కోసం నౌకాద‌ళం, కోస్ట్ గార్డ్ సేవ‌ల‌తో పాటు హెలికాప్ట‌ర్ ల‌ను సిద్ధంగా ఉంచారు. రుషికొండ బీచ్ వ‌ద్ద స‌ముద్రం నిన్న 200 అడుగులు వెన‌క్కి వెళ్ల‌డం గ‌మ‌నార్హం. దీంతో ఇసుక తిన్నెలు, రాళ్లు అన్నీ బ‌య‌ట ప‌డ‌డంతో స్థానికులు షాక్‌కు గుర‌య్యారు. ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా స‌ముద్రం 200 మీట‌ర్ల దూరం ఎండిపోవ‌డం ఏమిట‌ని అవాక్క‌వుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎప్పుడూ ఇలా 200 మీట‌ర్ల దూరం వ‌ర‌కు ఎండిపోవ‌డం ఇలా జ‌ర‌గ‌లేద‌ని చ‌ర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతోపాటు ఒడిశాలోని గంజాం, గజపతి, పూరీ, జగత్‌సింగ్‌పుర్‌ జిల్లాల్లో అధికారులు ఇవాళ‌ రెడ్‌ ఎలర్ట్‌ జారీచేసారు.  తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు విశాఖ‌, శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల క‌లెక్ట‌ర్లు, అధికారులు సిద్ధ‌మ‌య్యారు.  మ‌రోవైపు విశాఖ నేవీ కూడా జొవాద్ తుఫాన్‌ను ఎదుర్కునేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది.






 

మరింత సమాచారం తెలుసుకోండి: