చింతలపూడి నియోజకవర్గానికి గుండెకాయ లాంటి జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలో జరిగే ప్రతి పార్టీ కార్యక్రమంలోనూ ఆయన తన వంతుగా ముందు ఉంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పార్టీ పిలుపు ఇవ్వడమే ఆలస్యం ఆయన ముందుండి పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. ఆకుమర్తిది ముందు నుంచి వివాదాలకు దూరంగా ఉండే మనస్తత్వం. పార్టీలో పెద్ద, చిన్న నాయకులతో పాటు అన్ని సామాజిక వర్గాల్లోనూ ఆయనకు పట్టుంది. అందరిని సమన్వయం చేసుకునే సత్తా ఉంది. పైగా స్థానికుడు కావడం కూడా రామారావుకు కలిసి రానుంది.
శభాష్ అన్న లోకేష్.. మరోసారి పిలుపు పక్కా...ఆకుమర్తి రామారావు తాజాగా హైదరాబాద్‌లో యువనేత నారా లోకేష్‌ను కలిశారు. పదేళ్లుగా ఆయన లోకేష్ పేరుతో చేస్తోన్న సేవా కార్యక్రమాల గురించి లోకేష్‌కు ఇంతకు ముందే తెలుసు. తాజాగా మరోసారి ఆయన తాను నారా లోకేష్ సేవా సమితి పేరుతో చేస్తోన్న కార్యక్రమాల వివరాలను ఆయనకు వివరించగా.. వాటిని సవివరంగా చూసిన లోకేష్ రామారావును ప్రత్యేకంగా అభినందించారు. అలాగే త్వరలోనే మీకు సమాచారం ఉంటుందని.. మీరు పార్టీ కార్యాలయంలో కలవాలని కూడా సూచించినట్టు తెలిసింది. దీంతో ఆకుమర్తికి లోకేష్ పిలుపు ఎందుకోసమా ? అన్న చర్చ అయితే స్థానిక పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.