ఆర్థికమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.
ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. రోశయ్యకు మరి రాజశేఖర్ రెడ్డి కి మంచి స్నేహ బంధం ఉండేది. రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందు నుంచే  రోశయ్యకి పరిచయం ఉండేది. ఆయన కడప జిల్లాకి రోషయ్య వెళ్ళినప్పుడు పరిసర ప్రాంతాల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆయన కూడా రోశయ్య వెంట ఉండేవారని వారి ఇద్దరి మధ్య బంధం ఇలా కొనసాగుతూ ఉండేదని, అలా వారి మధ్య కొనసాగినటువంటి పరిచయం రాజశేఖర్రెడ్డి మరణించేవరకు కూడా, వీరి  ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతూ వచ్చింది.


రాజశేఖర్రెడ్డి రోశయ్య మధ్య స్నేహబంధం ఎలాంటి కల్లాకపటం లేకుండా ఉండేదని రోశయ్య అంటుండేవాడు. రాజశేఖర్ రెడ్డి ఎలాంటి సమస్యలు వచ్చినా రోశయ్య దగ్గరకు వచ్చి  చెప్పుకునే వాడని  ఆయన తెలియజేశారు. ఇంకా చాలా రోజులు బతక వలసిన  ఆయన అకాల మరణం చెందడం  ఎంతో బాధించిందని ఆయన వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని ఆయన మాటల్లోనే తెలియజేశారు. ఈ విధంగా రోశయ్య మరియు వైయస్ రాజశేఖర్ రెడ్డి మధ్య రాజకీయంగా కానీ, కుటుంబపరంగా కానీ మంచి ప్రేమ ఆప్యాయతలు బంధాలు ఉండేవి. ఇద్దరు నేతలు సుదీర్ఘకాలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి  మంచి నేతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో  ఈ మధ్య ఉన్నటువంటి స్నేహ బంధానికి బ్రేక్ పడింది. ఏది ఏమైనా ఎంతోమంది గుండెల్లో నిలిచి ఉన్నటువంటి రోశయ్య అకాల మరణం ఎంతో బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: