ఆంధ్ర ప్రదేశ్ లో ఆర్థిక శాఖ కు వన్నె తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే కొణిజేటి రోశయ్య అని స్పష్టంగా చెప్పుకోవచ్చు .సహజంగా రాజకీయ నాయకులు ప్రత్యక్ష రాజకీయలలో ఉంటారు. ప్రత్యక్ష ఎన్నికలలో నే పోటీ చేస్తారు. రోశయ్య స్టేలే వేరు. ముందు శాసన మండలికి ఎన్నికై, ఆ తరువాత శాసన సభలో ప్రవేశించిన వ్యక్తి. నిఖార్సయిన కాంగ్రెస్ వాది. గాంధీ సిద్ధాంతాలను పుణికి పుచ్చుకున్న వ్యక్తి. రాజకీయలలో ఉన్నప్పుడు... విరమించుకున్నాక ఆయన నిత్యం చదివే పుస్తకాలు గాంధీజీ పుస్తకాలే. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పార్లమెంట్ లో వ్యవసాయంపై జరిగే చర్చల్లో చురుకుగా పాల్గోన్న వ్యక్తి ఆచార్య ఎన్.జి. రంగా. ఆయన శిష్య పరమాణువు కొణిజేటి రోశయ్య. గుంటూరు హిందూ కాలేజి పూర్వ విద్యార్థి అయన కొణిజేటి 1968లో శాసన మండలికిఎన్నికయ్యారు. బహుశా పట్టభద్రుల నియోజక వర్గం నుంచి అయిఉండవచ్చు. ఆ తరువాత వరుసగా 1974లోనూ, 1980 లోనూ శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. నాటి చట్ట సభలు ఇప్పటిలాగా ఏక పక్షంగా ఉండేటివి కాదు. అధికార పక్షం సభ్యులు కూడ ప్రతిపక్ష సభ్యులవలే ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేవారు. ప్రభుత్వాలు కూడా చట్ట సభలలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సూటిగా స్పష్టంగా సమాధాలు చెప్పేవి. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వ్యక్తిగత ధూషణలు, ఉండేటివి కాదు. ఒకరి అభిప్రాయాలను మరోకరు గౌరవించుకునే వారు.

కొణిజేటి రోశయ్య మంత్రి కాక ముందు వివిధ శాసన సభా సంఘాలలో సభ్యుడిగా ఉండేవారు . ఆయన ఏ సభా సంఘంలో  సభ్యుడిగా  ఉన్నా కూడా ఆర్థిక పరమైన అంశాలపైనే దృష్టి సారించే వారు. ఆయన ప్రతిపక్ష సభ్యుడిగా ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి స్థాయీ సంఘ సమావేశాలలో ఆయన సభ్యుడిగా ఉండాలని అధికార పార్టీ నేతలు కోరేవారంటే అతిశయోక్తి లేదు. ఎవరితో ఏం సంభాషించినా , చలోక్తులు విసిరినా అన్నీ కూడా ఆర్థిక సంబంధిత విషయాలపైనే ఉండేవి.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పన్నుల విభాగాలను, వాటి అంతర్గత విషయాలను ఆయనే స్వయంగా పర్యవేక్షించేవారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఆర్థిక పరంగా తీసుకు రావల్సిన సంస్కరణలపై ఎక్కువ దృష్టి సారించేవారు. ద్రవ్యలోటును ఎలా కట్టడి చేయాలన్న దానిపై  దృష్టి సారించేవారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరం చాలా సార్లు రోశయ్య సలహాలను తీసుకున్నట్లు బహిరంగంగానే పేర్కోన్న విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: