సాధారణం గా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపించి ప్రయోజకులను చేయాలని భావిస్తూ ఉంటారు. ఈ క్రమం లోనే సామాన్య ప్రజలు అయితే ప్రైవేట్ స్కూలుకి పంపించే స్తోమత ఉండదు కాబట్టి ఇక దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తల్లి దండ్రులు మాత్రం పిల్లలను బడికి పంపించాలీ అంటేనే భయపడి పోతున్నారు. ఎందుకంటే బడికి పంపిస్తే తమ పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవుతారు అన్నా ఆలోచన కంటే ఎక్కడ తమకు కడుపుకోత మిగిలిపోతుందని ఆ తల్లిదండ్రులు భయపడి పోతున్నారు.


 దీంతో తమ పిల్లలు చదువుకోక పోయినా పర్లేదు కానీ బడికి మాత్రం పంపించుబోము అంటూ చెప్పేస్తున్నారు. అదేంటి తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించడం కి ఎందుకు అంతా  భయపడిపోతున్నారూ అని ఆశ్చర్యపోతున్నారా. ఎందుకంటే బడికి పంపితే తమ పిల్లల ప్రాణాలు ఎక్కడ పోతాయో అని తల్లిదండ్రులు భయపడి పోతున్నారు. దీనికి కారణం ఆ పాఠశాలలో చదువుతున్న పిల్లల ప్రాణాలు కోల్పోతూ ఉండటం. వరుసగా పాఠశాలలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతు ఉండడంతో తమ పిల్లలను పాఠశాలకు పంపించాలంటే వణికిపోతున్నారు స్థానిక ప్రజలు.


 ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యల గూడెం మండలం లో వెలుగులోకి వచ్చింది.. జడ్పీ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి ఇటీవల అనారోగ్యం తో మృతి చెందాడు. అయితే ఇలా నెల రోజుల వ్యవధి లోనే ఇదే స్కూల్లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు కూడా మృతి చెందడం సంచలనం గా మారి పోయింది. దీంతో హై స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చేపట్టారు. తాగునీరు కలుషితం అవ్వటం లేదా ఆహారంలో మార్పు వలన విద్యార్థులు అనారోగ్యం బారిన పడి చనిపోతున్నారని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. విద్యార్థులను సముదాయించేందుకు పాఠశాల యాజమాన్యం ఎంత ప్రయత్నించినా నిరసన విరమించేది లేదు అంటూ కూర్చున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: