ప్రపంచాన్ని వణికిస్తున్న  మహమ్మారి కరోనా వైరస్. ఇప్పటికే ఎన్నో రూపాంతరాలు చెందిన వైరస్... ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఓ వైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే వంద కోట్ల పైగా డోసులు వేసేసినట్లు కేంద్రం ప్రకటించింది కూడా. ఇప్పుడిప్పుడే ప్రజలంతా సాధారణ జీవితానికి అలవాటు పడుతున్నారు. ఆర్థిక స్థితి కూడా సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఈ దశలో ఇప్పుడు మరోసారి కొత్త వేరియంట్ కలవరపెడుతోంది. ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రపంచ దేశాలు మరోసారి లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఓమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం కూడా విధించాయి పలు దేశాలు.

ఇప్పుడు తాజాగా భారత్‌లో కూడా రెండు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పోల్చితే... భారత్ చాలా మేలు. అయితే పెరిగే ప్రమాదం లేకపోలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు కూడా. అయితే బెంగళూరులో నిర్వహించిన ఓ అంతర్జాతీయ స్థాయి డాక్టర్ల కాన్ఫరెన్స్... ఓమిక్రాన్ వేరియంట్ సూపర్ స్ప్రెడర్‌గా మారేందుకు కారణమని ఆందోళన చెందుతున్నారు ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఓ డాక్టర్ ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డారు. ఆయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు తెలిపారు. కేవలం ఇంటర్ నేషనల్ డాక్టర్స్ కాన్ఫరెన్స్‌లో మాత్రమే ఆయన పాల్గొన్నారని అధికారులు గుర్తించారు. నవంబర్ 19, 20, 21వ తేదీల్లో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. దీనిని ఇండియన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ దీన్ని నిర్వహించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: