నీటిని బాగా మరిగించి చల్లార్చి తాగాలని సూచించారు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్. ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణం సంబంధిత వైద్య అధికారిని కలవాలని చెప్పారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ అన్నారు. గ్రామాల్లో సమస్య ఉంటే వాటిని కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలని చెప్పారు. అధికారులకు సహకారం అందిస్తూ తుఫాను సమయంలో సురక్షితంగా ఉండుటకు ప్రయత్నించాలని కలెక్టర్ అన్నారు. ఇక తుఫాను ప్రభావిత మండలాల ఆస్థి నష్ట వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. జవాద్ తుఫాన్ సందర్భంగా భారీ వర్షాలు కురిసిన నేపధ్యంలో ఆస్థి, తదితర నష్ట వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీతతో సమీక్షించారు. తుఫాను తర్వాత.... బాధితులకు తక్షణమే సహాయం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.