రాజకీయాలలో ఎక్కడో కొద్ది మందిని స్వచ్ఛమైన వాళ్ళను చూస్తాం. అలా ఉన్న వాళ్ళను కూడా తమకు అనుకూలంగా మార్చుకునే పార్టీలు ఉన్నాయి లేదా వారికి తెలియకుండా వారిని అడ్డం పెట్టుకొని తమ రాజకీయాలు కొనసాగించే పార్టీలు ఉన్నాయి. అలాంటి పార్టీ అని తెలిసినా తన కర్తవ్యం వరకు నెరవేర్చి, పక్కకు వెళ్లే వారు రోశయ్య. పార్టీలో లోపాలు ఉండొచ్చు కానీ అవన్నీ ఎత్తి చూపకుండా, తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిచేయడం లో ఆయన తన వైఖరిని ప్రదర్శించేవారు. అయినా చాలా సార్లు ఆయన అభిమన్యుడిగా మిగిలిపోయారు. అభిమన్యుడి గురించి తెలిసిందేగా, ఆయనకు పద్మవ్యూహంలోకి వెళ్లడమే కానీ రావడం తెలియని వారు. అలా రోశయ్యను కూడా అనేక సార్లు పార్టీ ఇబ్బందులకు గురిచేసింది కూడా. అయినా తన అడుగు వెనక్కి వేయకుండా బాధ్యతలపై దృష్టి పెట్టేవారు.

మొదటి నుండి రోశయ్య అసలు గొడవలు అనే విషయాలకు దూరంగానే ఉండేమనిషి, అలాగే టీడీపీ కి మాత్రం మొదటి నుండి గట్టిగా సమాధానం చెపుతూనే వచ్చేవారు. ఆయన టీడీపీ అధినేత పై విసిరిన విమర్శలు అసలు మరో నేత ఎవరు వేసి కూడా ఉండరు. అంతగా ఆయన ఆ పార్టీపై విరుచుకుపడేవారు. అలాగని ఇప్పటిలాగా దుర్భాషలు ఆయన భాషలో ఉండేవి కావు, కేవలం మాట చురుక్కు మని తగిలేలా అనేవారు. ఒకసారి రాజశేఖరరెడ్డి గారు సీఎం అయినప్పటి నుండి ఆయన అభిమన్యుడి పాత్ర అయిపోయింది. కారణం వైఎస్ ఎక్కడకు వెళ్లినప్పటికీ అక్కడ ఒక పధకం అమలు చేస్తా అని మాట ఇచ్చి వచ్చేవారు. ఇక్కడేమో అంత ఆర్థిక పరిస్థితి ఉండేది కాదు. రోశయ్య గారేమో లెక్కలలో తేడాలు వస్తే సహించరు. ఆయన పధకాలు ప్రవేశపెట్టడం ఎంత వరకు వెళ్ళింది అంటే, ఒక స్థాయిలో అప్పులు తెచ్చినా ఆరోగ్యశ్రీ, ఫీజ్ రిఇంబర్స్మెంట్ లు అమలు కష్టంగా ఉండేది. అవన్నీ వివరంగా చెప్పినా అలాగా అనడమే కానీ పెద్దగా స్పందించేవారు కారు వైఎస్. ఇలా ఆయన పాలనలో మాత్రం రోశయ్య పాత్ర ఖచ్చితంగా అభిమన్యుడే అని చెప్పాలి.

వైఎస్ మృతి తరువాత అధిష్టానం తమ పనులు చెప్పినట్టు చేసేవారు ఎవరు అని ఆలోచించి రోశయ్యను అప్పటి సీఎంగా నిర్ణయించారు. దానితో ఆయన సీఎం పదవి మోయాల్సి వచ్చింది. వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు మీడియా సంస్థలలో అనేక ప్రకటనలు ఇచ్చేవారు, దానికి 100-650 కోట్ల వరకు ఖర్చుచేసేవారు. రోశయ్య సీఎం అయ్యాక ఇంత ప్రకటనలు అవసరం లేదు అని ఆ  మొత్తాన్ని 50 కోట్లకు కుదించారు. దానితో మీడియా ఆయనపై నెగటివ్ గా ప్రచారం మొదలుపెట్టింది. ఆయన ఉన్నంతవరకు తమకు పెద్దగా ఫండ్స్ రావనేది వాళ్ళ ఆలోచన. దానితో 50 ని వంద చేశారు, అంతకంటే కుదరదు అని ఖచ్చితంగా చెప్పడంతో ఇక మీడియా ప్రచార జోరు తీవ్రం అయిపోయింది. అయినా ఆయన వెనకడుగు వేయలేదు. తరువాత రాష్ట్ర విభజన అనంతరం జరిగిన పరిణామాల తో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి సీఎం అయ్యారు. ఆయనకు కూడా మీడియా బాగానే మద్దతు పలికింది, కారణం ఆయన మళ్ళీ మీడియాకు ఫండ్స్ పెంచేశాడు. రోశయ్య ఒక్క రూపాయి ఆశించినవారు కాదు, ఆయన ఎప్పుడు తన కోసం ఏ పని చేసుకున్నది లేదు, అయినా ఇలాంటి ఒత్తిడులు తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: