రోశయ్య మొండితనం అనాలో లేక తన బాధ్యత నిర్వర్తించడంలో చూపించే వైఖరి అనాలో మరి. ఏది ఏమైనా ఆయన మాత్రం తనదైన శైలిలో ముందుకు వెళ్లారు తప్ప వెనకడుగు వేసే లక్షణం లేని వారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఆయన అదే మొండి తనం వహించారు. తనకు తెలియకుండానే తెరవెనుక జరిగిన విభజన కార్యక్రమానికి తాను బాధ్యత వహించలేక, తాను సీఎం గా ఉండగా రాష్ట్రము రెండు ముక్కలు కావడం ఇష్టం లేక ఆయన రాజీనామా చేసేశారు. ఇవన్నీ అప్పట్లో బయటకు రానప్పటికీ, తరువాత అందరికి అనుకూలంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. ఆయనకు విభజన విషయం తెలిసినప్పటికీ, ఇరువర్గాలకు నచ్చజెబుతూ కాలం గడిపేశారు.

మొదటిగా విభజన ప్రకటన వచ్చినప్పటి సందర్భంలో, ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుండి అప్పటి హోమ్ శాఖ లో ఉన్న వారు అధిష్టానానికి రాష్ట్ర పరిస్థితి గురించి లేక రాశారు. దానిలో ఏమున్నది చూడకుండా రోశయ్యగారు అధిష్టానానికి పంపించామన్నారు. అదే తప్పు అయిపోయింది. అందులో తెలంగాణ కోసం కేసీఆర్ ఉద్యమం నెరపుతున్నారు, భవిష్యత్తులో ప్రజావ్యతిరేకత పెరిగిపోయే అవకాశాలు బాగా ఉన్నాయనే అంశం కూడా ఉంది. ఇది చుసిన అధిష్టానం రోశయ్యగారిని ఢిల్లీ పిలిపించి వివరాలు అడుగగా, పరిస్థితి వివరించి, నిర్ణయం మీదే అని చెప్పేసి వచ్చేశారు. తీరా ఆయన ఎయిర్ పోర్టులో దిగేసరికి రాష్ట్ర విభజన ప్రకటన వచ్చేసింది. అంటే అప్పటికే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. కారణం అప్పట్లో తెలంగాణ కు చెందిన నేతలకు అధిష్టానంతో ఎక్కువ సత్సంబంధాలు ఉండేవి. దానితో వారు చెప్పింది విని అధిష్టానం కూడా సరే అన్నది. ఇదంతా రోశయ్యగారికి తెలియదు.

దీనితో ఆయన తాను సీఎంగా ఉండగా విభజన ప్రకటన చేయలేనని అధిష్టానానికి స్పష్టం చేసేశారు. అప్పుడు వేరే రాష్ట్రానికి గవర్నర్ గా నియమితులయ్యారు. ఏపీకి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం గా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇదంతా తెరవెనుక జరిగిన రాజకీయాలు. ఒక పార్టీలో నిజాయితీగా ఉన్న వ్యక్తికి కూడా తెలియకుండా పార్టీలు తమ పనులు చేపించుకుంటారు అనేదానికి ఇదో ఉదాహరణ. ఈ సమయంలో ఇవన్నీ తలుచుకోవడం లేదా తెలుసుకోవడం అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: