ఆర్థిక శాస్త్రం అనగానే మనకి ముందుగా కౌటిల్యుడు గుర్తుకొస్తాడు. మనకు ఆర్థికశాఖ అనగానే ప్రతి ఒక్కరికి టక్కున గుర్తుకు వచ్చేది కొణిజేటి రోశయ్య, ఆయన ఆర్థిక వేత్త  కాదు, ఆర్థిక నేతగా కూడా పేరు పొందారు. ఆయన జీవితంలో ఎన్నో పదవులు, ఉరుకులు,  పరుగులు, ఎన్నో సభలు సమావేశాలు ఎన్నో ప్రస్థానాలు, వీటన్నిటినీ దాటుకొని రాజకీయంగా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి చివరికి ఆయన తుది శ్వాస విడవడం బాధాకరం. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టి, ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆర్థిక శాఖ అంటే నిలువెత్తు సాక్ష్యం ఈ రోజుతో తెలుగు రాష్ట్రాలను వీడి  వెళ్ళిపోయింది. ఆయన రాజకీయంలో ఎన్నో నిర్ణయాలు పేదల ఆర్తనాదాలు, బడుగుల బాధలు, తోటి రాజకీయ నాయకుల స్నేహాలు  సుదీర్ఘకాల తెలుగు రాజకీయాల్లో అలుపెరుగని నేతగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. రోశయ్య అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలియని వ్యక్తులు ఉండరు.

ఆయనను చూస్తే ఒక రాజకీయ నేతలు చూసినట్టు కాకుండా మన ఇంట్లో ఉండే ఒక కుటుంబ పెద్దగా ఆయన రూపం, హుందాతనం కనిపిస్తోంది. ఆయన ఏనాడు కూడా ఏ ఒక్కరిని నిందించి, బాధించినట్టు ఇప్పటివరకు లేవని చెప్పవచ్చు. చాలా ఆలోచనాత్మకంగా ఆయన మాట్లాడుతుంటే అటువైపే చూడాలనిపించే విధంగా  మాట్లాడటంలో ఆయనను మించిన వారు ఎవరూ లేరని చెప్పవచ్చు. ఆయన రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి పదవి నుంచి ఇంకా అనేక పదవులు చేపట్టి దేశ రాజకీయ కురువృద్ధ నేతల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా పేరు సంపాదించాడు. అలాగే ఆయన ఎక్కువసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన రాజకీయ నేతల్లో మొట్ట మొదటి స్థానంలో నిలిచాడు అని చెప్పవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే మనస్తత్వం కలిగిన కొణిజేటి రోశయ్యను ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు చూసి ఎంతో నేర్చుకోవాలని అంటున్నారు. అలాంటి గొప్ప నాయకుడు తెలుగు ప్రజలను విడిచిపెట్టి వెళ్లి పోవడం చాలా బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: