క‌ష్ట‌మ‌యినా స‌రే సెక్ర‌టేరియ‌ట్ ఇక్క‌డికి తీసుకురావాలి

క‌ష్ట‌మ‌యినా స‌రే ఉద్యోగులు ఇక్క‌డి నుంచే ప‌నిచేయాలి

వీటి తీరు ఎలా ఉన్నా విశాఖ‌లో వైసీపీ పెద్ద‌గా అనుకున్న విధంగా రాజ‌ధాని సెంటిమెంట్ ను త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకు న్న‌దేమీ లేదు. అస‌లీ విష‌యాన్ని జ‌గ‌న్ చూస్తున్నంత గొప్ప‌గా ప్ర‌జ‌లు చూడ‌క‌పోవ‌డ‌మే విశేషం మ‌రియు విడ్డూరం కూడా!అయితే కొంద‌రు టీడీపీ నేత‌ల డీలా కార‌ణంగా వైసీపీ స్పీడు పెర‌గ‌వ‌చ్చేమో కానీ వాస్త‌వానికి జ‌గ‌న్ పాల‌న‌కు వ‌స్తున్న మార్కులు ఇక్క‌డ పెద్ద‌గా ఏమీ లేవ‌నే రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. కనుక రాజ‌కీయ రాజ‌ధాని విశాఖ కాదు అమ‌రావ‌తే కావ‌డం ఖాయం. వైసీపీ కి విశాఖ పై ప్రేమ పోతే భూములు నాలుగు మిగులుతాయి లేదంటే అవ‌న్నీ నాయ‌కుల ఖాతాలోకే వెళ్లిపోవ‌డం ప‌క్కా అన్న విమ‌ర్శ కూడా వ‌స్తోంది వైరి వ‌ర్గం నుంచి!



విశాఖ కేంద్రంగా ఒక రాజ‌ధాని తీసుకు రావాల‌ని వైఎస్ జ‌గ‌న్ క‌ల‌. ఆయ‌న క‌ల ఎలా ఉన్నా ఇప్ప‌టికిప్పుడు అది సాధ్యం అయ్యే లా లేదు. అందుకు రాజకీయంగా ఈ అంశాన్ని అవ‌కాశంగా తీసుకుని ఎదిగేందుకు జ‌గ‌న్ ఆలోచిస్తున్నారు. అందుకు త‌గ్గ ప్ర‌ణాళి క‌లూ వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ నేత అయ్య‌న్న‌కు చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే తిరుగులేని నేత గా పేరున్న అయ్య‌న్న‌కు గ‌త ఎన్నిక‌ల్లో వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి. కానీ ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌ల‌యితే మాత్రం నర్సీప ట్నం త‌మ‌దే అన్నంత ధీమాతో ఉన్నారు అయ్య‌న్న. గ‌త ఎన్నిక‌ల్లో డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ సోద‌రుడు గ‌ణేశ్ చేతిలో ఓడిపోయిన అ య్య‌న్న ఇప్పుడు త‌న‌దైన వ్యూహం ఒక‌టి అమ‌లు చేయాల‌నే భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల ప‌రిణామాల దృష్ట్యా వేగం వేగంగా రాజ‌కీయ ప‌నులు చ‌క్క‌బెట్టి అధికార ప‌క్షంను ఇరుకున పెట్టాల‌ని చూస్తున్నారు. ఇదే క్ర‌మంలో అయ్య‌న్న స్పీడు కూడా పెంచా రు.



జ‌గ‌న్ ను నోటికి వ‌చ్చిన విధంగా తిట్ట‌డంతో ఆయ‌న ఇటీవ‌ల కాస్త పాపుల‌ర్ అయ్యారు కూడా! ఇక మ‌రో నేత గంటా శ్రీ‌ను కూడా వైసీపీకి వచ్చేందుకే ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అవేవీ స‌ఫ‌లీకృతం కాలేదు. విశాఖ కేంద్రంగా రాజ‌కీయాలు న‌డుపుతున్న వారం దరి క‌న్నా గంటా మంచి ఉద్దండుడు. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ గా పేరుంది. అయిన‌ప్ప‌టికీ సాయిరెడ్డి రాజ‌కీయాలు గంటా వ‌స్తే సాగ‌వు క‌నుక గంటాను తీసుకోవ‌డం లేదు. ఉన్న అవంతి కూడా రేపో మాపో పార్టీ మారిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎన్నిక‌ల ముందో ఆ తరువాతో త‌న గురువు గంటా శ్రీ‌ను ఆదేశాల మేర‌కు అవంతి పార్టీ మారిపోవ‌డం ఖాయం. ఇక విశాఖ‌లో కాస్తో కూస్తో ప‌ట్టున్న నేత‌ల్లో టీడీపీ వ‌ర‌కూ వెల‌గ‌పూడి రామ‌కృష్ణ ఉన్నా కొన్ని కార‌ణాల రీత్యా వైసీపీపై ఫైట్ త‌గ్గించుకున్నారు. ఇదే క్ర‌మంలో బండారు సత్య‌నారాయ‌ణ లాంటి లీడ‌ర్లు కూడా అప్పుడున్న స్పీడులో లేరు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ ప్ర‌త్యామ్నాయ నేత‌ల వెతుకులాట ను కూడా వ‌దులుకోవ‌డం లేదు. వీలుంటే కొంద‌రు స్థానికేత‌రుల‌ను సైతం ప్రోత్స‌హించేందుకే ఆలోచిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: