గుంటూరు హిందూ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన రోశయ్య అనతి కాలంలోనే పెద్ద గుర్తింపు తెచ్చుకుని తరువాత రాజకీయ కు రు వృద్ధుడిగా స్థిరపడ్డారు. వైఎస్ కు ఆత్మబంధువుగా మారిపోయారు. అంతేనా కాంగ్రెస్ పార్టీ మార్కు రాజకీయాలకు అలవా టు పడిపోయారే తప్ప అలసట అయితే చెందలేదు. అలా అని తప్పుకుని పోయి తన దారి తాను వెతుక్కున్న దాఖలాలు ఉన్నా కూ డా అవేవీ చెప్పుకోదగినంత పెద్దవి కావు.


బీకామ్ చదువుకున్న పెద్దాయన రోశయ్య.. గుంటూరు ప్రకాశం జిల్లాల వాసులకు బాగా చిర పరిచితులు.  ఆర్య వైశ్య కులంలో పుట్టి, తరువాత రాజకీయంగా ఎదిగిన ఈ పెద్దాయన ఇప్పటికీ ఆదర్శ నేతే! ఎందుకంటే ఆర్థిక నేరాల పరంగా ఆయన వెనుకంజలోనే ఉన్నారు. పదవి ఉన్నా కూడా అల్లుడిపై జోకులు వేశారాయన. తన అల్లుడు తప్పు చేస్తే శిక్షించండి అని కూడా అన్నారాయన. తనకు చంద్రబాబు మాదిరి తెలివి తేటలు లేవని కూడా ఓ సందర్భంలో ఒప్పుకుని అందుకు కారణమేంటో చెప్పి మరీ  సభలో సొంత పార్టీ సభ్యులను నవ్వించారు ఆయన. ఆర్థిక మంత్రిగా స్ట్రిక్ట్.. వెరీ స్ట్రిక్ట్ అని అనిపించుకున్నారాయన.



అందరి కోమట్ల కన్నా తెలివైన కోమటి రోశయ్య. అలా అని మరీ! తెలివి మీరిన పనులయితే చేయలేదు ఆయన. వైఎస్ తో ప్రేమ పూర్వకంగానే మెలిగి ఆయనతో అన్న అని పిలిపించుకునేవారు. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్రవేసేవారు. ఆ రోజు అసెంబ్లీలో చంద్రబాబును ఉద్దేశించి చెప్పిన మాటలు కొన్ని ఇప్పటికీ గుర్తు పెట్టుకుని కొందరు జాగ్రత్తపడుతుంటారు.

అప్పుడూ ఇప్పుడూ రాజకీయం వేర్వేరుగా లేదు. కానీ వేర్వేరుగా మనుషులే ఉన్నారు. రాజకీయాల్లో అదే శత్రుత్వం ఉన్నా కూడా ఆ రోజు జోకులు నడిచేవి. ఇప్పుడు ఆ తరహా సమయ స్ఫూర్తే లేదు. ఎంత కాదన్నా వయసుకు గౌరవం దక్కించి వైఎస్ తో సహా అంతా రోశయ్యను ఎంతగానో ప్రేమగా చూసుకునేవారు. గాంధీ భవన్ రాజకీయం తెలిసినవారు ఎవరయినా రోశయ్యను చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగినా విని నవ్వుకుని ఊరుకునే వారు రోశయ్య. ఆయన పెద్దగా వివాదాల జోలికి పోకుండా తన దారి తాను చూసుకునేవారు. వైఎస్ ను కూడా ఆర్థిక సంబంధ నిర్ణయాల్లో నిలువరించేవారే కానీ పాలనకు మాత్రం ఆయన ఏనాడూ అడ్డు కాదు.

అపర చాణక్యుడిగా పేరున్న చంద్రబాబును నిలువరించిన ఘనత రోశయ్యది. రాజకీయాల్లో ఉన్నా లేకున్నా ఆయన స్థానం విశిష్టమైంది.  ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. వైఎస్ కు అత్యంత దగ్గర స్నేహితుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడూ సభలో చలోక్తులు విసురుతూ నవ్వించడంలో కూడా రోశయ్యది ప్రత్యేక శైలి. ఆనాడు చంద్రబాబు పై జోకులు వేసినా, చిన్న చిన్న పదాలతో కూడిన పిట్ట కథలు చెప్పి నవ్వించినా అదంతా రోశయ్యకే చెల్లు. ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు అసెంబ్లీ వేదికగా చాలా వాగ్వాదాలు నడిచేవి. ఇవన్నీ చూసి చూసి కొన్ని సార్లు విసిగిపోయేవారు. కొన్ని సార్లు కోపం తగ్గించుకునేందుకు హాయిగా నవ్వుతూ నవ్వించేవారు.


మరింత సమాచారం తెలుసుకోండి: