పీఏసీ ఏం చెప్పినా తిరుగుబాటు చేసి మాట్లాడడం రోశయ్యకు తెలుసు కానీ మన బుగ్గనకు తెలియదు. కనుక రోశయ్య నుంచి బుగ్గన నేర్చుకోవాల్సింది ఇదే! ప్రజా పద్దుల కమిటీ ఎప్పుడు ఏం మాట్లాడినా కాగ్ ఏం  చెప్పినా అంతెత్తున లేచి వైఎస్ కు అడగా నిలిచిన రోశయ్య.. అటుపై ఆయన మరణానంతరం కూడా తన హవాను కొనసాగించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తీ లేదు. వైఎస్ కూ నల్లారికీ ఇంకా చెప్పాలంటే చెన్నారెడ్డికి ఇలా అందరికీ ఆయన సన్నిహితుడు వివాద రహితుడు కూడా!


పంచెకట్టు పెద్దాయన ఇక లేరు.. తెలిసిన కోమటి తెలివైన కోమటి ఇక లేరు అని కూడా రాయాలి. పదవికి వన్నె తెచ్చిన నేతగా ఆయనకు ఉన్నపేరు ఎవ్వరికీ లేదు. పెద్దగా ఆర్థిక నేరాల్లో ఇరుక్కోని నేతగా కూడా ఆయనకు పేరు ఉంది. గాంధీభవన్ లో తన పేరు ఎలా వినిపించినా పట్టించుకోని పెద్దాయన. ఓ విధంగా చమత్కారి ఓ విధంగా నేర్పరి ఓ విధంగా సహన శీలి కూడా! పత్రికల్లో వార్తలకు సీరియస్ గా స్పందించే పెద్దాయన. ఆ విధంగా ఎవరో అన్న విధంగా ఆయన రోషయ్య..


వయసు మీదపడితే రాష్ట్రాలకు గవర్నర్లు కావొచ్చు.. వయసు మీద పడ్డాక ఎవరికైనా సలహాలు కూడా ఇవ్వవచ్చు. రోశయ్య ఈ రెండు పనులూ బాగానే చేశారు. పార్టీ నడపడంలో కొందరికి కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ విధంగా గౌరవం చాటుకున్నారు రాజకీ య పెద్దలు. అదేవిధంగా తమిళనాడు గవర్నర్ గానూ, కర్ణాటక గవర్నర్ గానూ పనిచేసి పెద్దాయన పాత్రకు వన్నె తెచ్చారు. కాం గ్రెస్ పార్టీ లో జరిగే రాజకీయాలపై మంచి పట్టు మరియు అవగాహన ఉన్న నేత రోశయ్య. డబ్బులు ఊరకనే ఖర్చు పెట్టించకండి అని వైఎస్ కు హెచ్చరించిన పెద్దాయన. ఇంతకుమించి ఆయన గురించి చెప్పేందుకు ఏమీ లేదు కానీ తనవంతుగా ఉమ్మడి ఆం ధ్రాకు ఆర్థిక మంత్రిగా సేవలు అందించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు.



సాధారణంగా ఉత్తరాంధ్ర కోమట్లు భయస్తులు ఆ మాటకు వస్తే రోశయ్య కూడా భయస్తుడే! పేరుకు ఆర్యవైశ్యుడే కానీ భయంలో మాత్రం అందరిలోనూ తానూ ఒక్కడే. సొంత సామాజికవర్గానికి ఎంతో సాయం చేసిన మంత్రి కూడా ఇతడే. కొన్ని సందర్భాల్లో విలేకరులకు కాస్తో కూస్తో సాయాలు చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. తెలుగు తప్ప ఇంగ్లీషు పెద్దగా పలకడం తెలియని పెద్దాయన. ఆర్థిక మంత్రిగా ఉంటూ ఆరోజు ఉమ్మడి ఆంధ్రలో అద్భుతాలు చేయని వ్యక్తి. అంకెల విన్యాసం  చేయడం అన్నది అద్భుతం కాదు కనుక ఆ మాట అన్నాను. బాబుపై చలోక్తులు విసిరే నేర్పరి. చూడు నాయనా చిట్టి తండ్రి అన్నది ఆయనను ఫేమస్ చేసిన ఊతపదం.

88 ఏళ్ల పెద్దాయన ఇక లేరు అని రాయడం మీడియా చేస్తున్న పని. ఆ పని అంతా చేసేదే కానీ ఆయన నిరాడంబరత గురించి, ఆయన దీక్షాదక్షతల గురించి రాయడంలోనే మంచి ఉంది అని విశ్వసిస్తాను. అందరి ముఖ్యమంత్రులతో మంచి స్నేహ బంధాలు నడిపిన రోశయ్య ఇవాళ మన మధ్య లేరు అని చెప్పడం బాధాకరం. ఆయన నాటి ఉమ్మడి ఆంధ్రాలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోజులను, నాటి మాటలను తల్చుకునే తీరడం ఓ కర్తవ్యం. కాంగ్రెస్ కు ఆయన విధేయుడు. కానీ కొన్ని సార్లు విభేదించారు కూడా!
అలా అని ఆయన నాయకత్వం పై ఎప్పుడూ అపోహలను పెంచుకోలేదు. నాయకత్వంను నమ్ముతూనే తన పని తాను చేసుకుని పోయారు. ఉమ్మడి ఆంధ్రాలో లక్ష కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టి కొన్ని వాస్తవ స్థితిగతులనూ వివరించిన పెద్దమనిషి. వైఎస్సార్ హామీలను చూసి భయపడిపోయి వద్దని వారించిన పెద్ద మనిషి కూడా ఆయనే! ఇవాళ ఆర్థిక మంత్రులందరికీ పెద్ద దిక్కు ఆయనే.రాష్ట్రం విడిపోయాక యనమల రామకృష్ణుడుకు  కానీ ఇప్పుడు చేస్తున్న బుగ్గనకు కానీ ఆయన ఓ ఆదర్శనీయం అని చెప్పక తప్పదు. తొలి సారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రోశయ్య ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తరువాత కాలంలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అటుపై ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: