కొత్త వేరియంట్ రాక‌తో స‌మాజం అంతా ఆందోళ‌న చెందుతోంది. కొత్త వేరియంట్ రాకతో కొన్ని రాక‌పోక‌లు నిలిచిపోతున్నాయి. ప్రాణాంత‌కం కాకున్నా ప్ర‌స్తుతానికి ప్ర‌పంచం స్తంభించిపోతున్నంత వాస్త‌విక స్థితి లేక‌పోయినా కొన్ని క‌థ‌నాలు కొన్ని అబ‌ద్ధ‌పు ప్ర‌చారాల కార‌ణంగా భ‌యం పెరిగిపోతోంది. అయితే కొన్ని నియంత్ర‌ణా చ‌ర్య‌లు చేప‌డితే ఈ వైర‌స్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చ‌ని వైద్య బృందాలు చెబుతున్నాయి. అందుకే పెద్ద‌గా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టంచేస్తూ ఉన్నాయి. కానీ  కొత్త వేరియంట్ పై వ‌స్తున్న అపోహ‌ల రీత్యా అబ‌ద్ధ‌పు ప్ర‌చారాలు పెరిగిపోతున్నాయి.


రెండు ద‌శ‌ల్లో క‌రోనా వ‌చ్చి జీవితాల‌ను అత‌లాకుత‌లం చేసింది. ఎంద‌రెంద‌రి జీవితాల‌కో ప్ర‌శ్నార్థ‌కం అయింది. ఎన్నో అనాథ శ‌వాల ను క‌ళ్లెదుటే ఉంచి వెళ్లింది. ఆక్సిజ‌న్ అంద‌క కొందరు,వేళ‌కు చికిత్స దొర‌క‌క కొంద‌రు త‌మ జీవితాల‌ను అర్ధంత‌రంగానే ముగించా రు. ప్ర‌భుత్వాస్ప‌త్రుల‌లో స‌రైన స్థాయిలో బెడ్లు లేక‌పోవ‌డం, కొన్ని వార్డుల్లో క‌నీస సౌక‌ర్యాలు లేక‌పోవ‌డం వంటివి చాలా కాలం స‌వాలుగానే మారాయి. ఆఖ‌రికి కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు ముందుకు వ‌చ్చి త‌మ ప‌రిధిలో కొన్ని ఐసొలేష‌న్ వార్డులు ప్రారంభించి, రోగుల‌కు చికిత్స అందేలా చేశారు. కొంద‌రైతే క‌రోనా కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమితం అయిన వారికి త‌మవంతు ఆహారం అందించి, ఆక‌లి తీర్చారు. కొంద‌రు కూలీల‌కు అండ‌గా నిలిస్తే ఇంకొంద‌రు వారికో నీడ క‌ల్పించి సొంత ఊరికి చేర్చారు. ఈ క్ర‌మంలో ఎంద‌రో దాత‌లు మ‌హ‌నీయులు అయ్యారు. ఎంద‌రో మామూలు మ‌నుషులు మ‌హ‌నీయులు అయి మాన‌వ‌త‌ను చాటుకున్నారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు కూడా త‌మ ప‌రిధిలో ఆక్సిజ‌న్ బ్యాంకులు ప్రారంభించి బాధితుల‌కు అండ ఇచ్చారు.



సోనూసూద్, చిరంజీవి వంటి వారు స‌హృద‌య‌త‌ను చాటుకున్నారు. సోనూ సూద్ త‌న ఫౌండేష‌న్ ద్వారా  ఎన్నో వేల‌మందికి సాయం అందించారు. వ‌ల‌స కూలీలు సొంత ఊరికి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసి వారి మ‌న్న‌న‌లు అందుకున్నారు. ఇక చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ త‌ర‌ఫున ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేసి, అవ‌స‌ర‌మైన వారికి ప్రాణ వాయువు అందించి పెద్ద దిక్కుగా నిలిచారు. ఆప‌ద్బాంధ‌వుడ‌య్యా రు. ఇప్పుడు మ‌ళ్లీ కొత్త వేరియంట్ ఒక‌టి వ‌చ్చి వ‌ణుకు పుట్టిస్తోంది. ద‌క్షిణాఫ్రికాలో పుట్టింద‌ని భావిస్తున్న తాజా వేరియంట్ పేరు ఒమిక్రాన్. దీనిపై ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని వైద్యులు చెబుతున్న‌ప్ప‌టికీ కొంద‌రికి అన్న అపోహ కార‌ణంగా భ‌య‌ప‌డిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: