ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇటీవల కాలంలో కాస్త కేంద్ర ప్రభుత్వానికి మరింతగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తో సన్నిహితంగా మెలిగే ఎందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కాస్త సీరియస్ గా  దృష్టి సారించడం తో విపక్షం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని ఢిల్లీ పర్యటనలో కొంతమంది కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కూడా కలిసే అవకాశాలు ఉండవచ్చు అని వార్తలు వస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని త్వరలోనే జగన్ కలగవచ్చని అయితే వీరిద్దరి మధ్య కీలక భేటీ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కూటమిలోకి ముఖ్యమంత్రి జగన్ ను బిజెపి పెద్దలు ఆహ్వానించి అవకాశం ఉందని ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య కీలక భేటీ త్వరలో జరుగుతోందని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని కొన్ని అంశాలలో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు వినబడుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి దగ్గర ఏ ప్రయత్నం చేయడం అలాగే అమరావతి ఉద్యమానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మద్దతు పలకడంతో చంద్రబాబు నాయుడు కాస్త స్పీడ్ గా ముందుకు అడుగులు వేస్తున్నారు అనేది అర్థం అవుతోంది. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి బలపడితే జగన్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తో జగన్ కలవాల్సిన అవసరం ఉందని ముఖ్యంగా బీజేపీ పెద్దలు తనకు దగ్గరగా ఉండాలని జగన్ భావిస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: