తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో ఉన్న కొంత మంది నాయకులను దగ్గర చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కష్టపడటం కాకుండా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో ఇబ్బంది పెట్టేందుకు ప్రజల్లో బలమైన రాజకీయ పార్టీలను కూడా దగ్గర చేసుకునేందుకు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కొనే నిలబడే పరిస్థితి లేకపోవడంతో బలంగా ఉన్న రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

చాలా వరకు కూడా కీలక నాయకులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ మీద పోరాటం చేయడానికి రెడీగా లేకపోవడంతో వాళ్లందరికీ కూడా ధైర్యం కల్పించేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా పక్కన పెట్టేందుకు కూడా కొంతమంది సిద్ధమయ్యారని ఈ నేపథ్యంలోనే యూపీఏ విషయంలో మమతా బెనర్జీ కాస్త అసహనంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలి అంటే కచ్చితంగా సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా అండదండలు కావాల్సిన అవసరం ఉంది.

అయితే సీఎం కేసీఆర్ కంటే ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడుగా రాజకీయం చేస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ నేపథ్యంలోనే తన రాజకీయ సలహాదారు అలాగే తన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో రంగంలోకి దించారని ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ను ఆయన కలిశారు అని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ వల్ల సీఎం కేసీఆర్ కి ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఏంటి అనేది తెలియక పోయినా మమతా బెనర్జీకి మాత్రం కెసిఆర్ వల్ల కాస్తో కూస్తో ఉపయోగం ఉంటుంది అనేది మాత్రం చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: