ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కొంత మంది వైసీపీ ఎమ్మెల్యే లు ఏమీ మాట్లాడక పోవడం ముఖ్యమంత్రి జగన్ ను బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పాలి. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రజల్లోకి వెళ్తున్నారా లేదా అనే దానిపై అసలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా క్లారిటీ లేదు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలవక ముందు ప్రజలు తిరిగి గెలిచిన తర్వాత అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనే దానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం అదేవిధంగా పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను పాటించక పోవడం కొంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు వినకపోవడం అలాగే ఎంపీలకు అందుబాటులో లేకపోవడం వంటివి ప్రధాన సమస్యగా మారింది.

రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బలపడే ప్రయత్నంలో భాగంగా కొన్ని కొన్ని సమస్యలను భుజానికెత్తుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తోంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే కొన్ని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడటం లేదు. కడప జిల్లాలో భారీ వరదలు వస్తే ప్రధానంగా మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సమాధానం ఇచ్చే విషయంలో ఘోరంగా విఫలమయ్యారు.

ఇటీవలి కాలంలో చిత్తూరు జిల్లా తో పాటుగా నెల్లూరకు అలాగే కడప జిల్లాలో భారీ వర్షాలు అదేవిధంగా వరదలు చుక్కలు చూపించాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త సీరియస్ గా ముందుకు వెళ్లి ప్రజల్లో ఉండటమే కాకుండా విపక్షాలు చేసే కొన్ని ఆరోపణలకు సమాధానం చెప్పాల్సి ఉందా సరే వైసీపీ ఎమ్మెల్యే లు ఏమీ మాట్లాడకపోవటంతో జగన్ కూడా కాస్త ఒత్తిడి ఫీలవుతున్నారని ప్రధానంగా అసలు ఏం మాట్లాడని ముగ్గురు ఎమ్మెల్యేలకు జగన్ క్లాస్ తీసుకున్నారని అంటున్నారు.మరి జగన్ ఎలాంటి  నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: