రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు దాదాపుగా రెండు మూడు నెలల నుంచి కాస్త గట్టిగానే వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తర్వాత కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజల్లోకి రావడం అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడం వంటివి చేసారు. కొన్ని కొన్ని అంశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బంది పెట్టేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని వైసిపి నాయకులు కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు

దానికి తోడు అమరావతి ఉద్యమానికి భారతీయ జనతా పార్టీ మద్దతు పలకడంతో టీడీపీ అధినేత కాస్త ఉత్సాహంగా ఉన్నారని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తో పాటుగా భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుందనే భావన లో చంద్రబాబునాయుడు అన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో చాలా మంది భారతీయ జనతా పార్టీ పెద్దలు ఆయనను కలవడానికి ఇష్టపడకపోవడం ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన కలవకపోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆయనను కలిసేందుకు ఇష్టపడకపోవడం తో చంద్రబాబు నాయుడు కాస్త డీలా పడ్డారు అని వార్తలు వచ్చాయి.

చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కొంత మంది కేంద్ర మంత్రులకు అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు మీ కలిసే ప్రయత్నం చేయగా అది అంతగా ఫలించలేదని అర్థమైంది. అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని దీనికి సంబంధించి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర  కుమార్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని టీడీపీ అనుకూల మీడియా లో వార్తలు వచ్చినా సరే అది నిజం కాదని తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: