2019 ముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎన్ని విధాలుగా చెప్పినా సరే వాళ్లు ప్రజల్లోకి వెళ్లకపోవడం టిడిపిని బాగా ఇబ్బంది పెట్టను అంశంగా చెప్పాలి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నా సరే ఎమ్మెల్యేల కారణంగా చంద్రబాబు నాయుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరకు 175 నియోజకవర్గాల్లో కూడా తానే పోటీ చేస్తున్నాను అనే భావనలో ఉండే ప్రజలు తనను గెలిపించాలని విజ్ఞప్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. టిడిపిలో ఉన్న చాలామంది నాయకులు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట వినకపోవడంతో ఇప్పటికి కూడా పార్టీ క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఎదుర్కొంటుంది.

పార్టీలో ఉన్న దగ్గర నాయకులు కూడా చంద్రబాబు నాయుడు మాట లెక్క చేయక పోవడంతో కొంత మంది ఎమ్మెల్యేలను ప్రజలు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి కాస్త పరిస్థితుల్లో మారడమే కాకుండా చాలామంది నాయకులు ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేయడం వంటివి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు 2019 ముందు చంద్రబాబు నాయుడు ఏ సమస్య ఎదుర్కొన్నారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇప్పుడు అదే సమస్య ఎదుర్కొంటున్నారని వైసిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు రాకపోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ లు పెట్టారు అని ప్రచారం కూడా జరుగుతోంది. కొంతమంది వైసీపీ కీలక నాయకులు ఎమ్మెల్యేలు మీద నిఘా పెట్టారని నియోజకవర్గాల్లో పలానా రోజున కార్యక్రమాలు నిర్వహించి దీనికి సంబంధించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి అభిప్రాయాలు సేకరించాలని లక్ష్యాలను నిర్దేశించి... అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు పాదయాత్రలు కూడా చేయాలని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది.మరి దీనిపై సీఎం జగన్ త్వరలో ఎలాంటి  నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: