2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీకి ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే ప్రధాన ఇమేజ్ గా ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడం ఎంపీలు కూడా ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయకపోవడం కనీసం మంత్రులు కూడా నియోజకవర్గాల్లో వెళ్ళాకపోవడం అనేది పెద్ద సమస్యగా. చాలా మంది ఎమ్మెల్యేలు అసలు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద కూడా ఎటువంటి సమాచారం లేకపోవడం ఈ మధ్యకాలంలో వైసిపి నాయకులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం గా చెప్పాలి.

టిడిపిలో ఉన్న కొంతమంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో ప్రజల్లోకి వెళ్లడంతో ఎమ్మెల్యేల పనితీరు విషయంలో జగన్ కాస్త సీరియస్ గా ఉన్నారని ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల మీద ప్రశాంత్ కిషోర్ ఎక్కువగా ఫోకస్ పెట్టారని అంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇటీవలికాలంలో బెంగళూరు లేదా హైదరాబాద్ లేదా చెన్నైలో ఎక్కువగా ఉండటంతో జగన్ సీరియస్ గా ఉన్నారని ప్రశాంత్కిషోర్ వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి జగన్ వద్ద పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపు ఆరు నెలల నుంచి జగన్ వార్నింగ్ ఇస్తున్న సరే లెక్కచేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడంతో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది.

ప్రధానంగా కర్ణాటక అలాగే చెన్నై సరిహద్దుల్లో ఉన్న రాయలసీమ ఎమ్మెల్యేల మీద ఎక్కువగా దృష్టి సారించారని అలాగే ఒడిస్సా సరిహద్దుల్లో ఉన్న ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేల మీద కూడా చేశారని తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల మీద ఎక్కువగా నిఘా పెట్టారని ఎవరైతే ప్రజల్లోకి వెళ్లకుండా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళందరూ నివేదికలు తెప్పించుకుని వాళ్లకు ఉద్వాసన పలికేందుకు అలాగే వారి వారి నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జి బాధ్యతలు అప్పగించేందుకు మార్గం రెడీ చేశారని సమాచారం.మరి ఫ్యూచర్ లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: