రాజ‌ధాని ఎక్క‌డ ఎప్పుడు వ‌స్తుంది ఎలా వ‌స్తుంది
ఇలాంటివ‌న్నీ మ‌న ప్ర‌శ్న‌లు కానీ బొత్స‌కు మాత్రం
చాలా చాలా సింపుల్ విష‌యం..అందుకే ఆయ‌న‌కు
రాజ‌ధాని పై విప‌రీతం అయిన స్ప‌ష్ట‌త ఉంది.
కానీ ఇప్పుడు బిల్లు మాత్రం ర‌ద్ద‌యిపోయింది
త్వ‌ర‌లో వ‌స్తుంది.. వీటిపై ఏం చెబుతారంటే..
ఇంకా అభిప్రాయాలు అధ్య‌య‌నాలు చేస్తామ‌ని..? 

వివాదాస్ప‌ద మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌ధానిపై స్పందించారు. 3 రాజ‌ధానుల‌పై మాట్లాడారు. కానీ ఎప్ప‌టిలానే అమ‌రావ‌తిపై కొంత అసంతృప్తితోనే  మాట్లాడారు.  ఏమ‌యిన‌ప్ప‌టికీ  ఆయ‌న బాబుపై ఉన్న అక్క‌సుతోనే ఈ రాజ‌ధాని నిర్మాణం ఆపారా అన్న విధంగానే కొన్ని మాట‌లు అర్థం వ‌చ్చేలా  చెప్పారు. బాగుంది కేవ‌లం టీడీపీ పై అక్క‌సుతోనే రాజ‌ధానిని అమ‌రావ‌తిగా ఉంచ‌డం త‌మ‌కు ఇష్టం లేద‌ని నేరుగా చెప్ప‌వ‌చ్చు కానీ చెప్ప‌రు. పోనీ ఆ గ్రామాల రైతుల‌కు ఏమ‌యినా న్యాయం చేస్తారా అంటే దానికీ ఓ స్ప‌ష్ట‌త లేదు. సో రోజుకో వాదం రోజుకో వివాదం వినిపించే మంత్రుల గురించి ఏం చెప్పినా మ‌రికొంత అభిప్రాయ భేదాలు రాజేయ్య‌డ‌మే!


రాజ‌ధాని విష‌య‌మై మంత్రి బొత్స మ‌ళ్లీ మాట్లాడారు. మ‌ళ్లీ అని ఎందుకు అంటున్నానంటే అంత‌కుముందు కూడా మాట్లాడారు క‌నుక. ఈ సారి కూడా అదే విష‌యం ప‌దే పదే చెప్పారు. మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి మ‌ళ్లీ బిల్లు తెస్తాం కానీ ఈ సారి టైం బౌండ్ అన్న‌ది లేదు క‌నుక ఒక్క శాతం త‌ప్పు కూడా లేకుండా తెస్తాం అని చెప్పారాయన. అదేవిధంగా రాజ‌ధాని గురించి గ‌తంలో తాను అనుచిత వ్యాఖ్య‌లేవీ చేయ‌లేద‌ని, అదంతా చాలా క్యాజువ‌ల్ గా అన్న మాట‌లే అని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ఏముంద‌క్క‌డ చంద్ర‌బాబు కానీ లోకేశ్ కానీ చూడ‌డానికి ఉత్త స్మ‌శానం త‌ప్ప అన్న మాట‌కు ఇప్ప‌టికీ క‌ట్టుబ‌డి ఉంటాననే అన్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ మునుప‌టి స్పీడు అన్న‌ది లేకుండా బొత్స త‌నదైన బాణీ ఓ మీడియా ప్ర‌తినిధికి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌దే ప‌దే గ‌తంలో చెప్పిన‌వే చెప్పి విసిగించి బుర్ర‌లు వాయగొట్టారు. ఇక అప్పుల విష‌య‌మై కూడా ఆయ‌న త‌న ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp