జవాద్ తుఫాన్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇంకా చెప్పాలంటే... ఉత్తరాంధ్ర వాసులను వణికించేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం... క్రమంగా తుపానుగా మారింది. ఇది ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలపై ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఇది అనూహ్యంగా దిశ మార్చుకుంది. ఇప్పుడు ఒడిశాలోని పూరీ తీరం వైపు పయనిస్తున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్‌ ప్రాంతానికి 310 కిలోమీటర్ల దూరంగా ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది ఉత్తర కోస్తాంధ్ర తీరం వద్దకు చేరుకున్న జవాద్ తుఫాన్... అనూహ్యంగా తన దిశను మార్చుకున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఒడిశా తీరం వైపు మెల్లగా పయనిస్తోంది ఇప్పుడు. ముందుగా ఉత్తరాంధ్రపై పెను ప్రభావం చూపుతుందని అధికారులు భావించారు.

జవాద్ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరించారు. కానీ ఇది పూరీ వైపు పయనిస్తుండటంతో... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై అంతగా ప్రభావం ఉండదని వెల్లడించారు. ఇది కేవలం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో మాత్రమే పయనిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఇది మరి కొన్ని గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలహీన పడే అవకాశం ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. దీంతో ఒడిశా తీరానికి కూడా పెద్దగా ప్రమాదం ఉండదని ప్రకటించారు అధికారులు. పూరీ తీరానికి చేరే సమయానికి మరింత బలహీన పడుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఇది తీరం దాటే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయన్నారు. దీంతో ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు తుపాను ముప్పు తప్పినట్లే అని ప్రకటించారు. అయితే అల్పపీడనం, వాయుగుండం కారణంగా ఈదురు గాలులు వీస్తాయని.. భారీ వర్షం కూడా కురుస్తుందని వెల్లడించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. సముద్రంలో అలలు ఎగసిపడతాయని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: