మన దేశంలో కరోనా కేసులు పెరిగిన కారణంగా.. కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది. ఈ మేరకు ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా లేఖ రాసింది. హాట్ స్పాట్ లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, విదేశీ రాకపోకలు.. ముఖ్యంగా రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చే ప్రయాణీకులపై దృష్టిసారించాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వారి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని ఆదేశించింది.

మరోవైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 722కేసులు నమోదయ్యాయి. ఇందులో కేవలం దక్షిణాఫ్రికాలోనే 217మందికి ఈ వైరస్ సోకింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా నుంచి వివిధ దేశాలకు ప్రయాణించిన వారి నుంచి వైరస్ వ్యాపించడం మొదలైంది. ఇందులో భాగంగానే మన దేశంలో ఇఫ్పటి వరకు 4కేసులు బయటపడ్డాయి.

ఇక కొవిడ్ కొత్త వేరియంట్లకు చెక్ పెట్టేందుకు.. బూస్టర్ డోసులు బాగా పనిచేస్తున్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా, ఫైజర్, నోవావాక్స్, జాన్సన్, మోడెర్నా, క్యూర్ వ్యాక్ టీకాల బూస్టర్ డోసులు సమర్థంగా పనిచేస్తున్నాయని బ్రిటన్ లోని పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. బూస్టర్ డోసులు సురక్షితమని.. వీటివల్ల రోగనిరోధక శక్తి బాగా పెంపొందుతోందని పరిశోధనలో వెల్లడైంది.

కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ పై భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. కొవాగ్జిన్ అనేది వైరియన్ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్ అనీ.. ఇది అధికంగా పరివర్తన చెందిన ఒమిక్రాన్ వేరియంట్ కు వ్యతిరేకంగా పనిచేయగలదని పేర్కొంది. అలాగే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్లను ఎదుర్కోగలదని చెప్పింది. మొత్తానికి కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  కాబట్టి ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాల్సిందే. లేకపోతే ప్రమాదం బారిన పడే అవకాశముంది.












మరింత సమాచారం తెలుసుకోండి: