ఎన్నికల వస్తే తప్ప ఏ రాష్ట్రం గురించైనా పట్టించుకునే పరిస్థితుల లేని రాజకీయాలు నడుస్తున్నాయి. కొద్దినెలల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు ఆ రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్న ఉత్తరాఖండ్‌పై ఇప్పుడు ప్రధాని మోడీ దృష్టి సారించారు. అసెంబ్లీ  ఎన్నికలకు మోడీ  డెహ్రాడూన్‌లో ప్రచారం ప్రారంభించారు. అక్కడ ప్రచార సభకు హాజరైన మోడీ.. ఆ రాష్ట్రానికి భారీ ప్రాజెక్టులు ప్రకటించేశారు.


ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో 18వేల కోట్లు విలువచేసే వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోడీ  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాు. 15వేల 728కోట్ల విలువచేసే వివిధ పనులకు భూమి పూజలు చేశారు. 2వేల573 కోట్లు విలువ చేసే మరో 7ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేశారు. వాటిలో దిల్లీ-డెహ్రాడూన్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఒకటి. ఈ ఎక్స్‌ప్రెస్‌ వే కారణంగా రెండు నగరాల మధ్య 68కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఇంకా హిమాలయ ఆలయాల పునరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన బద్రినాథ్‌ మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ కు  కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.


తాము ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లు ఉత్తరాఖండ్‌ దశ మారుస్తాయంటున్నారు ప్రధాని మోడీ. ఈ ప్రాజెక్టులతో ఈ దశాబ్దంగా ఉత్తరాఖండ్ దశాబ్దం అవుతుందని ప్రధాని మోదీ అంటున్నారు. ఇదే సమయంలో ప్రధాని యూపీఏ పాలనపై విమర్శలు కురిపించారు. యూపీఏ హయాంలో  మౌలిక వసతుల పేరుతో అనేక కుంభకోణాలు జరిగాయని ప్రధాని మోడీ విమర్శించారు. యూపీఏ హయాంలో దేశంలో ప్రాంతాల మధ్య అనుసంధానతలో సమతుల్యత లేదని ప్రధాని మోడీ అన్నారు. యూపీఏ పాలనలో పదేళ్ల పాటు జరిగిన నష్టాన్ని భర్తీ  చేసేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఇది ఓ మహాయజ్ఞం అని  ప్రధాని నరేంద్ర మోదీ వర్ణించారు.


2000 ప్రారంభంలో అప్పటి ప్రధాని వాజ్‌పేయి భారత్‌లో అనుసంధానతను పెంచడానికి ఉద్యమాన్ని ప్రారంభించారని.. మోడీ గుర్తు చేసుకున్నారు. ఆయన తర్వాత ఎంతో ముఖ్యమైన దేశ సమయాన్ని యూపీఏ వృధా చేసిందన్నారు. యూపీఏ చేసిన నష్టాన్ని భర్తీ చేసేందుకు తాము రెండింతల వేగంతో కష్టించి పని చేశామని ప్రధాని మోడీ చెప్పుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: