ఒమిక్రాన్‌.. ఒమిక్రాన్.. ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న కొత్త పదం ఇది. కరోనాలో డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో అన్ని దేశాలు ఈ వేరియంట్ పై అలర్ట్ అవుతున్నాయి. అందుకే విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో చాలా ఆంక్షలు పెడుతున్నాయి. విమానాశ్రయాల్లోనే కరోనా టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపుతున్నారు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా వారం రోజులు హోం  క్వారంటైన్‌ తప్పనిసరి.


ఈ జాగ్రత్తలు మంచివే అయినా.. కొన్నిసార్లు అధికారులు అనుమానితులను బాగా ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా లండన్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిని అధికారులు తీవ్రంగా ఇబ్బంది పెట్టారని ఆ మహిళ చెబుతోంది. ముందు తనకు నెగెటివ్‌ మీరు ఇంటికెళ్లివచ్చన్నారట.. ఆ తర్వాత గంటలోపే మీకు పాజిటివ్‌ వచ్చింది అన్నారట.. అంతే కాదు.. ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోవాలంటూ బెదిరించారట.


దీనికి తోడు సదరు ఒమిక్రాన్ అనుమానితురాలు మా ఆధీనం నుంచి పారిపోయి వచ్చిందని మీడియాకు సమాచారం ఇచ్చారట. ఎన్నో రోజుల తర్వాత చంటిపాపతో స్వదేశంలో అడుగుపెడితే ఇలా ఇబ్బందిపెట్టారని ఆ మహిళకు తీవ్రవేదనతో చెబుతోంది. సదరు బాధితురాలు నవంబరు 30 సాయంత్రం లండన్‌లో కొవిడ్‌ నెగెటివ్‌ ఆర్‌టీపీసీఆర్‌ ధ్రువపత్రం తీసుకున్న బయలు దేరారట. పరీక్షలన్నీ చేసి 4 గంటలు ఆలస్యంగా విమానం ఎక్కించారట. శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగగానే పరీక్షల కోసం గంటల తరబడి నిలబెట్టారట. పరీక్ష ఫలితం నెగెటివ్‌ అని ముందు చెప్పి ఇంటి వెళ్లిపోవచ్చన్నారట. ఆ తర్వాత గంట తర్వాత పాజిటివ్‌ అంటూ ఇంకో మెయిల్‌ పంపారట. ఇంటికి రాగానే పోలీసులు వచ్చి  అంబులెన్సులో టిమ్స్‌కి తరలించారట. అక్కడ పరీక్షల్లో మళ్లీ నెగెటివ్‌ వచ్చిందట. అసలు ఏంటీ పరీక్షలు.. ఏది తప్పు.. ఏది రైటు.. ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమేనా అని ఆ బాధితురాలు ప్రశ్నిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: