ఏపీ రాజకీయాలు గత ఐదారు నెలలుగా చాలా చిత్రవిచిత్రంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలోనే ఎవరు ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమకు అనుకూలంగా ఉన్నంతవరకు ఎవరిని అయినా వైసీపీ తమ వాళ్ళగానే చూస్తున్నారు. ఎప్పుడు అయితే తమకు సెగ మొదలైందని భావిస్తుందో ? అప్పుడు ఆ నేతలను వైసీపీ దూరం పెడుతున్న సంకేతాలు ఇస్తోంది. తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ఇదే పరిస్థితి ఎదురైంది అని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వంశీ భువనేశ్వరి ని ఘోరంగా అవమానించారు అన్న కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ వ్యాఖ్య‌లే ఇప్పుడు ఏపీలో అధికార వైసిపి వర్సెస్ విపక్ష టీడీపీ నేతల మధ్య తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. చంద్రబాబు సైతం ప్రెస్ మీట్ లో భోరున విలపించే పరిస్థితి వచ్చేసింది. తెలుగుతమ్ముళ్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేయ‌డంతో పాటు ... వంశీతో పాటు కొడాలి నాని పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వీరి ఫోటోలకు పాడి కట్టి మరి శ‌వ యాత్రలు నిర్వహించారు. అయితే ఇప్పుడు వంశీ విషయం యూటర్న్ తీసుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ ఆ తర్వాత వైసిపి మద్దతుదారుగా చేరిపోయారు.

ఇప్పుడు ఈ విషయంలో వైసీపీపై సాధారణ ప్రజల్లో కూడా తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. దీంతో వైసీపీ వంశీ కి సపోర్ట్ చేసే విషయంలో చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ఈ వివాదాన్ని గ్రామస్థాయి వరకు బలంగా తీసుకెళ్లిపోయారు. ఇది వైసీపీపై నెగిటివ్ గా వెళుతోంది. దీంతో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు భువనేశ్వరి అక్క నిజంగా బాధపడి ఉంటే త‌మ కన్నీళ్లతో ఆమె కాళ్ళు క‌డుగుతామ‌ని చెబుతున్నారు.

చివరకు వంశీని ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యే , అత‌డితో మాకు సంబంధం లేదని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే వైసిపి గేమ్ లో వంశీ బ్లేమ్ అయిపోయారు అన్న చర్చలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై వంశీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: