ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరుస గెలుపు లతో భ్రమలో మునిగి తేలుతున్నారా ? వచ్చే ఎన్నికల్లో కూడా తనకు తిరుగులేదని .. మరోసారి తాను ముఖ్యమంత్రిని అవుతానన్న ధీమా కు వచ్చేసారా ? అంటే అవున‌నే ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ గత ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రతో ఆంధ్రప్రదేశ్ జనాలు జగన్ కు ఒక సారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యారు. అందుకే ఆయనకు ఏకంగా 151 సీట్లతో అధికారం కట్టబెట్టారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ తీరులో మార్పు వచ్చిన‌ సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికితోడు వరుసగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీకి తిరుగులేని విజయాలు నమోదు అవుతున్నాయి.

ఈ విషయాలన్నీ కూడా కేవలం తన వల్లే వచ్చాయని ... తనను చూసే ఆంధ్రప్రదేశ్ జనాలు అన్ని ఎన్నికల్లోనూ వైసీపీని బంప‌ర్ మెజార్టీతో గెలిపిస్తున్నార‌న్న‌ నిర్ణయానికి జగన్ వ‌చ్చిన‌ట్టే కనబడుతోంది. అందుకే జగన్ సొంత పార్టీ నేతలను ఎవరినీ కూడా పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాను ఏం చేయాలి అనుకుంటున్నారో ? అది మాత్రమే చేస్తున్నారే తప్ప సొంత పార్టీ నేతలు చెబుతున్న విషయాలను ఆయన ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో ఇప్పుడు మంత్రులు , ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా డ‌మ్మీలు అయిపోయారు.

వారికి తమ నియోజకవర్గాల్లో కూడా ఏమాత్రం ప్రాధాన్యత లేకుండా పోయింది. చివరకు ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే రేపటి ఎన్నికల్లో కార్యకర్తలు ఎవరు కూడా వైసీపీ గెలుపు కోసం కసితో పని చేసే పరిస్థితి లేదు. అది ఎప్పుడు అయితే మిస్ అయిందో ... పార్టీ సహజంగానే అధికారానికి దూరం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ ఇప్పటికి అయినా తన తీరు మార్చుకోని కార్యకర్తలకు , పార్టీ నేతలకు ప్రాధాన్య‌త ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: