ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని ఘనవిజయాలతో దూసుకుపోతున్న అధికార వైసీపీపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు పరిపాలన విషయంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఎక్కడికక్కడ రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్య మాన‌వుడు స‌జావుగా జీవించే ప‌రిస్థితి లేదు. ఆర్థిక భారంతో ప్ర‌జ‌లు అంతా విల‌విల్లాడు తున్నారు. కేవలం సంక్షేమం త‌ప్పా... అభివృద్ధి అన్న మాట వినిపించడం లేదు.

ఇప్పుడిప్పుడే సామాన్య ప్రజల్లో కూడా జగన్ పరిపాలన పై ఆలోచన మొదలైంది. మరోవైపు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదు.. వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న ల‌క్ష్యం తోనే జగన్ ముందుకు వెళుతున్నట్లు కన్పిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎలా ? అయితే ప్రతిపక్షాలను పూర్తిగా అణచి వేశారో... ఇప్పుడు ఏపీలో జగన్ అదే పంథాలో ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీలో చాలా మంది నేత‌లు, ఎమ్మెల్యేల‌కు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము గెలుస్తామ‌న్న న‌మ్మ‌కాలు అయితే లేవు.

అయితే జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చే య‌డంతో ఇప్పుడు టీడీపీ వాళ్లు మ‌ళ్లీ గెలుపు త‌మ‌దే అన్న ధీమాకు అయితే వ‌చ్చేశారు. ఇప్ప‌టికి ప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే ఖ‌చ్చితంగా తాము 100 సీట్ల‌తో అధికారంలోకి వ‌స్తామ‌ని లెక్క‌లు వేసుకుంటున్నారు. క‌డ‌ప జిల్లాలో కూడా రెండు సీట్ల‌లో తాము గెలుస్తామ‌ని చెపుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ బ‌ల‌మైన మార్పు వ‌చ్చేసింద‌ని ఆ పార్టీ నేత‌ల అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

చిత్తూరు లో 6, నెల్లూరు జిల్లాలో ఐదు సీట్లు, అనంత‌పురం జిల్లాలో ఆరు సీట్ల లో తాము గెలుస్తామని. కృష్ణా , గుంటూ రు జిల్లా ల‌తో పాటు గోదావ‌రి జిల్లాల్లో ఐదారు సీట్లు మిన‌హా అన్ని సీట్లు మా ఖాతాలోనే ప‌డ‌తాయ‌ని ఆ పార్టీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: