ప్రకృతి పగబట్టింది అంటే చాలు మనిషి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు. కొన్ని కొన్ని ఘటనలు చూస్తూ ఉంటే ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అగ్నిపర్వతం పేలింది అని ప్రజలను భయాందోళనకు గురయ్యారు ఎక్కడ ప్రాణాలు పోతాయో అని ఆందోళన చెందారు. కానీ అంతలోనే భూకంపం కూడా రావడం అందరూ ప్రాణాలపై ఆశలు వదులుకునే పరిస్థితి వచ్చింది. ఈ ఘటన ఆగ్నేయ ఆసియా లో వెలుగులోకి వచ్చింది.. ఆగ్నేయ ఆసియాలో ద్వీప సముదాయం దేశం గా వున్న ఇండోనేషియాలో ఒక భారీ భూకంపం సంభవించింది.



 ఇండో పసిఫిక్ కలయిక ప్రాంతంలో భూమి టెక్టోనిక్ ప్లేట్లు కలిసేచోట ఉండటంతో ఇక ఇండోనేషియా లో తరచూ భారీ భూకంపాలు వస్తూ ఉంటాయి  దీంతో ఏ క్షణంలో భూమి కంపిస్తుందో అని అక్కడి ప్రజలు భయపడిపోతుంటారు. ఇలా కొన్ని కొన్ని సార్లు భూకంపాలు భారీ ప్రాణ నష్టం కలిగించిన సందర్భాలు కూడా ఉన్నాయి.అదే సమయంలో ఇండోనేషియాలో అతిపెద్ద అగ్నిపర్వతం లో ఒకటైన సుమేరు పర్వతం కూడా ఉంది. అగ్నిపర్వతం ఎప్పుడు అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. ఇలా ఓ వైపు నుంచి అగ్నిపర్వతం బద్దలై మరో వైపు నుంచి భూకంపం వస్తే ఇక ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది. ఇటీవల ఇలాంటి ఘటన చోటు చేసుకుంది.



 ఇండోనేషియాలోని ఇటీవలే భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.2 గా నమోదు అయినది అనీ అధికారులు గుర్తించారు.. ఇండోనేషియాలోని టోబేలో పట్టణానికి 259 కిలోమీటర్ల దూరంలో భూకంపం ఏర్పడడం గమనార్హం. అయితే ఇంత భారీ స్థాయిలో భూకంపం వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం జరగకపోవడం గమనార్హం. అదే సమయంలో అటు ప్రభుత్వం కూడా ఎలాంటి సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. ఇక అదే సమయంలో సుమేరు అగ్నిపర్వతం కూడా బద్దలయింది. అందరినీ భయబ్రాంతులకు గురి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు పలువురు గాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: