కరోనా వైరస్ వ్యాప్తి జరిగి వరుస గా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన తర్వాత సామాన్యుడి జీవితం మొత్తం అతలాకుతలం అయి  పోయింది.  అయితే అప్పటికే రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ సాగిపోతున్న జీవితాన్ని లాక్ డౌన్ నేలకేసి కొట్టినంత పని చేసింది. ఎందుకంటే ఇక లాక్‌డౌన్‌ తర్వాత అన్ని ధరలు పెరిగిపోయాయి. అదేసమయంలో సామాన్యుడు ఉపాధి మాత్రం తగ్గిపోయింది. దీంతో కుటుంబ పోషణ ప్రతి సామాన్యుడికి ఎంతో భారంగానే మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇప్పటికే నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి  పోయాయి. మరోవైపు అటువంటి ధరలు కూడా సామాన్యుడికి ఎంతో భారం గా మారి పోయాయ్. ఇంకోవైపు పెట్రోల్ బాదుడు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. దీంతో సామాన్యుడి జీవితం రోజురోజుకు భారంగానే మారిపోతుంది. ఇలాంటి సమయంలోనే అటు కూరగాయల ధరలు కూడా కొండెక్కి కూర్చున్నాయి. మొన్నటి వరకు ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడం తో సామాన్యుడు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల టమాటా ధర భారీగా పెరిగింది. కిలో టమాట ధర 150 రూపాయల వరకు పలికింది.



 ఇక ఇప్పుడు దొండకాయ ధర కూడా భారీగా పెరిగిపోవడం మాత్రం సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. టమాటా బాటలోనే దొండకాయ కూడా పయనిస్తోంది.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మార్కెట్లో కిలో దొండకాయ ధర ఏకంగా 100 రూపాయలు పలికింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కూడా ఇదే ధర పలుకుతూ ఉండటం గమనార్హం. ఇక్కడి మార్కెట్లకు శ్రీకాకుళం నుంచి దొండకాయను దిగుమతి చేసు కుంటూ ఉంటారు. అయితే ఏపీలో భారీ వర్షాల కారణంగా శ్రీకాకుళం లో భారీగా దొండ కాయ పంట దెబ్బతింది   దీంతో వ్యాపారులు హుబ్బలి నుంచి దొండకాయ దిగుమతి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దొండకాయ ధర భారీగా పెరిగి పోయి సామాన్యుడికి భారంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: