టీడీపీలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం లేదు. అసలు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దగ్గర నుంచి నేతలు అడ్రెస్ ఉండటం లేదు. నియోజకవర్గాల్లో మళ్ళీ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు మాత్రం చేయడం లేదు. అందుకే చంద్రబాబు....కొందరు మాజీ ఎమ్మెల్యేలని సైడ్ చేసేసి...ఆయా నియోజకవర్గాల్లో కొత్త నేతలని ఇంచార్జ్‌లుగా నియమించారు. ఇలా కొత్త ఇంచార్జ్‌లు వచ్చాక మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు కనిపించడం లేదు. దీంతో టీడీపీలో వారి భవిష్యత్ ఏంటి అనేది అర్ధం కావడం లేదు.

అసలు వారు పార్టీలో ఉంటారా లేదా అనేది కూడా తెలియడం లేదు. వీలుని చూసి పార్టీ మారిపోతారా? లేక టీడీపీలోనే ఉంటే భవిష్యత్‌లో ఏదొక పదవి వస్తుందనుకుని కంటిన్యూ అవ్వాలి. మరి మాజీ ఎమ్మెల్యేలు ఎలాంటి స్టెప్ వేస్తారనేది క్లారిటీ రాకుండా ఉంది. పామర్రు మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అయితే ముందు నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉండటం లేదు. అందుకే ఆమెని తప్పించి వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాకు బాధ్యతలు అప్పగించారు.

ఇప్పుడు కల్పన పరిస్తితి ఏంటి అనేది క్లారిటీ లేదు. ఆమె పార్టీలో కూడా కనిపించడం లేదు. వీలుని బట్టి పార్టీని వీడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అటు భీమవరంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కూడా టీడీపీలో కనిపించని విషయం తెలిసిందే. అందుకే ఆయన్ని సైడ్ చేసి తోటా సీతారామలక్ష్మిని ఇంచార్జ్‌గా పెట్టారు. మరి ఆయన ఇప్పటికీ పార్టీలో లేరు.

ఇటు మాడుగులలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని పక్కనబెట్టి పీవీజీ కుమార్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. దీంతో గవిరెడ్డి కూడా పార్టీలో కనిపించడం లేదు. మరి ఈయన కూడా పార్టీలో కంటిన్యూ అవుతారో లేదో క్లారిటీ లేదు. మొత్తానికైతే ఈ మాజీ ఎమ్మెల్యేలు టీడీపీలో కనిపించడం లేదు. మరి భవిష్యత్‌లో వీరి రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి.    

 

మరింత సమాచారం తెలుసుకోండి: