జగన్ క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల్లో సగంపైనే మంత్రులు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నట్లు సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే మంత్రులుగా పనితీరు బట్టే కాదు...వారి వారి నియోజకవర్గాల్లో కూడా వ్యతిరేకతని ఎదురుకుంటున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ ఎన్నికల్లో కొందరు మంత్రులు గెలవడం చాలా కష్టం అని చెబుతున్నారు. అయితే కొందరు మంత్రుల పరిస్తితి మాత్రం కాస్త మెరుగ్గానే ఉన్నట్లు కనిపిస్తోంది. మంత్రులుగా సరైన పనితీరు కనబర్చకపోయినా సరే...వారి వారి నియోజకవర్గాల్లో స్ట్రాంగ్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది.

అలా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌ పరిస్తితి కూడా మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు మామూలుగానీ చెల్లుబోయిన జాక్‌పాట్ కొట్టారనే చెప్పొచ్చు. అసలు రామచంద్రాపురం నియోజకవర్గం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ది. ఆయనే వైసీపీని నడిపిస్తున్నారు. కానీ వరుసగా ఓడిపోతూ వస్తుండటంతో గత ఎన్నికల్లో ఆయన్ని మండపేట పంపించారు. దీంతో రామచంద్రాపురంలో చెల్లుబోయినని నిలబెట్టారు.

ఇక జగన్ గాలిలో చెల్లుబోయిన...బలమైన తోట త్రిమూర్తులుపైన గెలిచారు. ఓడిపోయాక తోట టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈయనకు జగన్ మండపేట బాధ్యతలు అప్పగించారు. మళ్ళీ పిల్లి సుభాష్ రూపంలోనే చెల్లుబోయినకు బంపర్ ఆఫర్ వచ్చింది. మండలి రద్దు కావడంతో పిల్లి..ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో పిల్లి సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయినని మంత్రి పదవి వరించింది. ఇక పిల్లికి రాజ్యసభ ఇచ్చిన విషయం తెలిసిందే.

మంత్రి అయ్యాక చెల్లుబోయిన తనదైన శైలిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. కాకపోతే మంత్రిగా మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని తెలుస్తోంది. కానీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఆయన స్ట్రాంగ్‌గా ఉన్నారు. పైగా రామచంద్రాపురంలో టీడీపీ వీక్‌గా ఉంది. ఆ పార్టీ తరుపున రెడ్డి సుబ్రహ్మణ్యం పనిచేస్తున్నారు...కానీ ఆయనకు పార్టీని నిలబెట్టే సత్తా లేదు. దీంతో చెల్లుబోయినకు తిరుగులేకుండా పోయింది. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఈయనకు ఎదురు ఉండదని తెలుస్తోంది.ఒకవేళ టీడీపీ-జనసేనలు కలిస్తే ఏమన్నా పరిస్తితి మారుతుందేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: