ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిన్న‌టి నుంచే రోశయ్య పార్థివ దేహానికి ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు నివాళులర్పిస్తున్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌, అభిమానుల సంద‌ర్శించేందుకు వీలుగా రోశ‌య్య భౌతికకాయాన్ని గాంధీభ‌వ‌న్‌కు త‌ర‌లించారు. ఉద‌యం 11.15 గంట‌ల‌కు రోశ‌య్య నివాసం నుంచి  పార్థివ దేహాన్ని వాహ‌నంలోకి ఎక్కించారు. అక్క‌డి నుంచి గాంధీభ‌వ‌న్‌కు తీసుకువ‌చ్చారు.  గంట నుంచి గంట‌న్న‌ర వ‌ర‌కు ఉంచిన త‌రువాత మ‌ధ్యాహ్నం 1 గంట‌ల త‌రువాత  కొంప‌ల్లి ఫాంహౌస్‌లో రోశ‌య్య అంత్య‌క్రియ‌లు ఇవాళ నిర్వ‌హించ‌నున్నారు.

ఇప్ప‌టికే తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాలు రోశ‌య్య మృతి చెంద‌డం ప‌ట్ల మూడు రోజుల పాటు సంతాప దినాలు 4, 5, 6 తేదీల‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు తెలిపాయి.  తెలంగాణ ప్ర‌భుత్వం  ఇవాళ దేవ‌ర‌యాంజల్ ఫాంహౌస్‌లో రోశ‌య్య అంత్య‌క్రియ‌ల‌ను ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో అధికారికంగా నిర్వ‌హించ‌నున్న‌ది. ఇప్ప‌టికే మాజీ సీఎం రోశ‌య్య మృత‌దేహానికి ఇవాళ మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, వైవీసుబ్బారెడ్డి, నాదేండ్ల భాస్క‌ర్‌రావు వంటి ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించారు.

రోశ‌య్య మృత‌దేహాన్ని గాంధీభ‌వ‌న్ కు త‌ర‌లిస్తున్న నేప‌థ్యంలో ఉద‌యం 9 గంట‌ల నుంచే ఒక్కొక్క‌రూ నేత‌లు గాంధీభ‌వ‌న్ కు త‌ర‌లివ‌చ్చారు. మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల త‌రువాత గాంధీభ‌వ‌వ‌న్ నుంచి అంతిమ‌యాత్ర ప్రారంభ‌మ‌వ్వ‌నున్న‌ది. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల త‌రువాత కొంఫ‌ల్లిలోని దేవ‌ర‌యాంజ‌ల్ ఫాంహౌస్‌లో రోశ‌య్య అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. కాసేప‌ట్లోనే కాంగ్రెస్ సీనియ‌ర్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే గాంధీభ‌వ‌న్‌కు చేరుకుని మాజీ సీఎంకు నివాళుల‌ర్పించ‌నున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌రుపున రోశ‌య్య అంత్య‌క్రియ‌ల‌కు మంత్రులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌లు హాజ‌రు అవ్వ‌నున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌రుపున ఎంపీ కేశ‌వ‌రెడ్డితో పాటు ప‌లువురు మంత్రులు రోశ‌య్య పార్థివ‌దేహం వ‌ద్దే ఉన్నారు. కొంప‌ల్లిలో రోశ‌య్య అంత్య‌క్రియ‌ల‌కు పూర్తి ఏర్పాట్ల‌ను సిద్ధం చేసారు. అభిమానులు, కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ వ‌చ్చినా కార్య‌క‌ర్త‌లు వ‌చ్చినా ప్ల‌కార్డుల‌ను ఏర్పాటు చేసారు దారి చూపించ‌డానికి. పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు, అభిమానులు వ‌స్తుండ‌డంతో కార్తీక మాసంలో వ‌న‌భోజ‌నాలు చేయ‌డం ఆన‌వాయితీగా చేస్తున్నారు.  ఫాం హౌస్ మొత్తం ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాల‌ని కూలీల‌కు సూచించేవాడని కుటుంబ స‌భ్యులు పేర్కొన్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: