ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా స్థానిక సంస్థ‌ల నేత‌లు గోవాకు ప‌య‌న‌మ‌య్యారు. సుమారు 600 మంది స్థానిక నేత‌లు గోవా శిభిరాల్లో సేద‌తీరుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు, కాంగ్రెస్ కూడా త‌మ లోక‌ల్ బాడీ లీడ‌ర్ల‌కు వేరే మ‌కాం ఏర్పాటు చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తూర్పు గోదావ‌రి జిల్లా మారేడు మిల్లులో క్యాంపు సిద్ధం చేశారు. అక్క‌డ ఏజెన్సీలో ఉన్న రుచుల‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నార‌ట‌. గోవాలో క్లాస్‌గా న‌డుస్తున్న క్యాంపు పార్టీలు అక్క‌డ మాత్రం ఊర‌మాస్‌గా ఉన్నాయంట‌. మేయ‌ర్లు, చైర్మెన్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇంకా ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు ఉన్న స్థానిక సంస్థ‌ల ఓట‌ర్లంద‌రినీ ద‌శ‌ల వారీగా గోవా క్యాంపున‌కు సుమారుగా 600 మందికి పైగానే త‌ర‌లించారు.


 ఖ‌మ్మం న‌గ‌రానికి చెందిన కార్పొరేట‌ర్ల‌ను ప్ర‌త్యేక విమానాల్లో త‌ర‌లించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల‌ను ప్ర‌త్యేక బ‌స్సుల్లో గోవా శిభిరానికి త‌ర‌లించారు. వీరి కోసం స‌క‌ల సౌక‌ర్యాలు ఉన్న రిసార్టుల్లో ఏర్పాట్లు సిద్దః చేశారు. క్యాంపు ఇన్‌చార్జీల‌ను ఏర్పాటు చేసి ప్ర‌తి ఒక్క‌రికీ ఏం కావాలో తెలుసుకుని క్ష‌ణాల్లో అందించే ఏర్పాట్లు చేశారు. మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ఒక సమావేశానికి గోవా వెళ్తున్నారు. ప‌నిలో ప‌నిగా త‌మ వాళ్ల‌ను ప‌ల‌క‌రించి స‌దుపాయాలు, సౌక‌ర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుని వ‌స్తార‌ని అంటున్నారు. అయితే, గోవాలో నేత‌లు ప్ర‌వ‌ర్త‌నా తీరుతో ప్ర‌జ‌లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నార‌ని స‌మ‌చారం.

 
   ప‌నిలో ప‌నిగా వాళ్ల‌కు ఓట్లు ఎలా వెయ్యాలి, ఎవ‌రెవ‌రికి వెయ్యాలి అనే క్లాసులు కూడా జ‌రుగుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ త‌తంగాన్ని ఆ జిల్లా ముఖ్య‌నేత‌లు ముందుండి న‌డిపిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. నిజం చెప్పాలంటే డ‌బ్బులు తీసుకుని ఓట్లు వేస్తే ఇలాంటి నాయ‌కులే పుట్టుకు వ‌స్తార‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌కులు అంటున్నారు. తమ ప‌ద‌వులు కాపాడుకునేందుకు ఇలాంటి దిగ‌జారుడు ప‌నులు చేయ‌డ‌మేంట‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇలాంటి క్యాంపు రాజ‌కీయాలు ఎన్నాళ్లు జ‌రుగుతాయ‌ని ప్ర‌జాస్వామ్య వాదులు ప్ర‌శ్నిస్తు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: