భారత్ రష్యా స్నేహబంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. వార్షిక సదస్సులో భాగంగా రేపు  ఢిల్లీకి రానున్నారు. రేపు సాయంత్రం 5:30 నిమిషాలకు ప్రధాని మోడీతో పుతిన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంకేతిక రంగాల్లో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం  ఉంది. ఇందులో భాగంగా 200 హెలికాప్టర్ల తయారీ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అదేవిధంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, పలు అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. రాత్రి 9:30 నిమిషాలకు  పుతిన్ రష్యా కు తిరుగు పయణం అవుతారు.

కాగా పుతిన్ గౌరవార్ధం మోడీ విందు ఇవ్వనున్నారు. ఈరోజు రాత్రి రష్యా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి ఢిల్లీ చేరుకోనున్నారు. ఇరు దేశాల రక్షణ,విదేశాంగ మంత్రులు చర్చలు జరుపుతారు . ఆఫ్గనిస్తాన్ ఉగ్రవాద సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి. రష్యా నుంచి ఆధునిక AK203 తుపాకుల అత్యవసర కొనుగోలుకు ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. రక్షణ రంగం ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న  Ak203 రైఫిల్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. రష్యా సహకారంతో ఉత్తరప్రదేశ్లోని అమేథీ లో ఐదు లక్షల ఏకే-203 రైఫీల్లా తయారీ కీ తుది అనుమతులు మంజూరు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు అనుమతులు లభించడం విశేషం. ప్రస్తుతం ఆర్మీ వినియోగిస్తున్న ఇన్సాస్ రైఫిల్ల స్థానంలో ఈ తుపాకులను ప్రవేశపెట్టనున్నారు. ఏకే-203 రైఫిల్ల నుంచి తూటాలు 300 మీ. వరకు దూసుకెళ్లగలవు. రక్షణ ఉత్పత్తుల తయారీ రంగంలో ఆత్మ నిర్బర్ సాధించడానికి తాజా నిర్ణయం బాటలు పరుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కొత్త ప్రాజెక్టు కారణంగా సూక్ష్మ, చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు అవకాశాలు మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: