రేవంత్ రెడ్డి  అధ్యక్షుడు అయ్యాక దూకుడు మాములుగా లేదు. తెలంగాణ కాంగ్రెస్ కు ఒక్క సారిగా ఊపు తేవడంలో రేవంత్ మానియా మామూలుగా పని చేయలేదు. అసలు రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టక ముందు వరకు తెలంగాణలో  70నుంచి 80 సీట్లలో పోటీ చేసేందుకు నాయకులు లేరు. అసలు పోటీ చేస్తామని కూడా ఎవరూ ముందుకు రాలేదు. అలాంటిది ఇప్పుడు మిర్యాలగూడ కొల్లాపూర్, వికారాబాద్, తాండూర్ లాంటి చోట్ల కూడా ఒక్కో సీటుకు ముగ్గురు, నలుగురు నేతలు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. రేవంత్ ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ సీనియర్లతో పాటు అసంతృప్త నేతలను కలుస్తూ చకచకా ముందుకు దూసుకుపోతున్నారు.

అయితే మధ్యలో హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో రేవంత్ కాస్త స్లో అయినట్లు మాత్రమే కనిపించారు.అయితే అక్కడ రాజకీయ వ్యూహం వేరే ఉంది. ఆ తర్వాత టీ కాంగ్రెస్ నేతలు కొందరు హై కమాండ్ కు ఫిర్యాదు చేయడంతో, హైకమాండ్ నుండి కూడా రేవంత్ కు వార్నింగ్ రావడంతో రేవంత్ సీనియర్లను కూడా కలుపుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల వరి మీద జరిగిన ధర్నా కార్యక్రమానికి కోమటిరెడ్డితో సహా సీనియర్ నేతలు అందరూ వచ్చారు. ఇప్పుడు టీ కాంగ్రెస్ క్యాడర్ కూడా మంచి ఊపు మీదే ఉంది. అయితే కెసిఆర్ ఎవరి అంచనాలకూ అందరు. తమకు కాంగ్రెస్ ప్రత్యర్థి కాదు, బిజెపియే అని టిఆర్ఎస్ వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ లెక్కలు వేరే ఉన్నాయి. రేవంత్ దూకుడు కూడా కేసీఆర్ ను కలవరపెడుతోంది. కెసిఆర్ తమకు బిజెపీయే ప్రత్యర్థి అని ఎంత చెప్పినా ఆ పార్టీకి స్థానికంగా క్యాడర్ లేదు. మరోవైపు తెలంగాణలో ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. బిజెపికి నాయకుల కొరత తీవ్రంగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఆప్షన్ కోసం ఎదురుచూస్తున్నా నాయకులు, క్యాడర్ కూడా కాంగ్రెస్ వైపే చూస్తోంది. రేవంత్ ఇదే అదనుగా పాత కాంగ్రెస్ నాయకులు, పాత టిడిపి నాయకుల్ని సమన్వయం చేసుకొని పార్టీని బలోపేతం చేసేందుకు బాగా వర్కౌట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కెసిఆర్ టిఆర్ఎస్ ను గట్టిగా విమర్శించే నేతలను ఎంపిక చేసుకొని వీరినే మీడియా డిబేట్ లకు పంపేలా ప్లాన్ చేస్తున్నారట. రేవంత్ ఇదే ఊపు కంటిన్యూ చేస్తే ఎన్నికలకు ముందు బీజేపీ  స్ట్రాంగ్ నెస్ తో పాటు టిఆర్ఎస్ అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో న్యూట్రల్ ఓటర్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి దీనిని రేవంత్ రెడ్డి ఎలా క్యాష్ చేసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: