అసమర్థత అన్నది అన్నివేళలా
నిండా ముంచడం ఖాయం
అయినా కూడా ఆర్థికంగా ఉన్న
అసమర్థతలే ఇప్పుడు రాష్ట్రాన్ని వెనక్కు నెడుతున్నాయి
పెట్టుబడులను ఆకర్షించే పని చేయలేక చతికిలపడుతున్న వైనం
కనీస స్థాయిలో కూడా అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని
దురవస్థ నుంచి జగన్ సర్కారు కోలుకోవడం ఇప్పట్లో కష్టం!



పాదయాత్రలో జగన్ వేరు, అధికారంలో జగన్ వేరు. అందుకే ఆయనంటే చాలా మందికి కోపం కూడా! పాలనతో ఆయన ఆదర్శనీయం అని అనుకుంటారే కానీ అనుకున్నంత అయితే కాదు అని తేలిపోయింది. వైఎస్సార్ కు ఏ మాత్రం పోలికే లేదు. సంక్షేమంలో ఆయన కూడా ఆ రోజు జోరుగానే ఉన్నా  కూడా రోశయ్య లాంటి వారు వద్దని వారించి కాస్తో కూస్తో నియంత్రించగలిగారు. ఆయన ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ లాంటివి తెస్తే వాటికి మరో పదో పదిహేనో కార్యక్రమాలు (అన్నీ ఆర్థిక సంబంధ తాయిలాలే) కలిపి ఈయన పథకాలు అనౌన్స్ చేశారు. ఆ రోజు ఎవరు వద్దన్నా ఒప్పుకోలేదు. వినలేదు. ఇప్పుడు ఓ మట్టి రోడ్డు వేసేందుకు కూడా నిధులు లేవు. వీటికి తోడు ఆర్థిక సంక్షోభం నడుస్తోంది. అప్పులు పుట్టుక లేనేలేదు రేపటి నుంచి! ఇప్పుడేం చేస్తారో?


చాలా రోజుల నుంచి ఒన్ టైమ్ సెటిల్మెంట్ కు సంబంధించి ఓ చర్చ నడుస్తోంది. దీనిపై చాలా మంది వ్యతిరేకతతో ఉన్నారు. పదివేలు కట్టి గృహాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని ప్రభుత్వం అందించే ఓ నజరానా మాదిరిగా దీని గురించి చెబుతున్నారు. ఇలా కడితే ఆ ఇంటిపై పూర్తి హక్కులు మీవే అని అంటున్నారు.కానీ క్షేత్ర స్థాయిలో ఇందుకు అంగీకారం లేకుండా పోతోంది. మరోవైపు వరదలొచ్చి సర్వం కోల్పోయిన వారిని ఆదుకోకుండా పరామర్శలతో కాలం వెళ్లదీస్తే సమస్యలు ఎవరు తీరుస్తారని ఇంకొందరు మథనపడుతున్నారు. కనీసం తెగిపోయిన వంతెనలకు వెంట వెంటనే మరమ్మతులు చేయించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకోకుంటే ఇకపై పాలన విషయమై జవాబుదారీతనం ఎక్కడి నుంచి వస్తుందని!


అసలు ఏ దారి చూడు ఇలానే ఉంది.. ఏ దారి చూడు అస్తవ్యస్తతతోనే ఉంది..అస్తవ్యస్తతలోనే ఉంది. ఎవ్వరూ వీటిని పట్టించుకోరు. అలా అని పాలన లేదా అంటే ఉంది. ఉన్నవారంతా సంక్షేమ నామ జపం చేస్తున్నారు. ఉన్నవారంతా అసలు సిసలు నటన సంబం ధ చర్చలలో ఉన్నారు. ఈ సందర్భంలో జగన్ ను ఢీ కొనే శక్తి లేదు. అదే వాళ్ల ధీమా. కానీ ఈ విధంగా పాలన జగన్ నుంచి ఆశించ లేదు ఎవ్వరూ! ఆయన వరదల సమయంలో ఆదుకుంటారని, తీవ్ర స్థాయిలో వానొస్తే ముఖ్యంగా తుఫానొస్తే ఆదుకుంటారు అని భావించారే కానీ ఎవ్వరూ ఈ విధంగా ఆయన పాలన ఉంటుందని కలగలనలేదు. అనుకోలేదు. అస్సలు భావించనూ లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp