సాధారణంగా ఒకపార్టీ వ్యతిరేకతను మరో పార్టీ అనుకూలంగా మార్చుకోవడం ద్వారా ఎన్నికలలో అనుకూల ఫలితాలు పొందుతుంది, అధికారంలోకి వస్తుంది. ఈ లక్షణం అందరిలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భాలను వాడుకున్నవారు అందరు ఫలితాలు అనుకూలంగా పొందటం కూడా కుదరని పని. రాష్ట్ర విభజన తరువాత అధికారం పొందినప్పటికీ, టీడీపీ చేసిన పనుల వలన అనేక వ్యతిరేకతలు ప్రజలలో బయలుదేరాయి. అవన్నీ గమనించిన వైసీపీ వాటిని అనుకూలంగా మార్చుకొని అధికారంలోకి వచ్చింది. అనంతరం చెప్పినవన్నీ చేయడం ద్వారా ఇంకా సుస్థిర స్థానాన్ని ప్రజల గుండెల్లో సాధించుకుంది.

కానీ అన్ని నిర్ణయాలు అందరిని సంతోషపెట్టలేవు, అందుకే ప్రతి ప్రభుత్వానికి కొంత కాకపోయినా కొంతైనా వ్యతిరేకత ఉంటుంది. అది అనేక కారణాల వలన కాస్త ఎక్కువ కూడా ఉండొచ్చు. ప్రస్తుతం ఏపీలో అలాంటి పరిస్థితి ఉంది. మొదటి అననుకూలత సినిమా ఆన్ లైన్ చేయడం ద్వారా ఆయా హీరోల అభిమాన వర్గాలు, తమను నిర్లక్ష్యం చేసినట్టు భావిస్తున్న కొందరు నిరుద్యోగులు, మధ్యతరగతి, రేషన్ డీలర్లు, ఉద్యోగులు, మందు బాబులు, కాపు సామజిక వర్గం, మీడియా, అమరావతి రైతులు, రియల్టర్లు, రైతులలో సీమ వాళ్ళు అందరు తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. అయితే వీళ్లందరినీ బాబుగారు అనుకూలంగా మార్చుకోగలరా అనేది ఇక్కడ ప్రశ్న.

ఆ మాత్రం ఆయన చేయగలిగితే కొంతలో కొంతైనా ఓట్లు చీల్చే అవకాశాలు లేకపోలేదు. కనీసం గతంలో ఓటమి కంటే కాస్త మెరుగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఏదో చేసేస్తాం అనే మాటలు ఇవ్వడం ద్వారా ఇవన్నీ సాధ్యం అయ్యేవి కావు, తమకు స్పష్టంగా ఏదైనా పరిష్కారం చూపిస్తే గాని వాళ్ళు నమ్మరు అనేది ప్రస్తుత పరిస్థితి. అందుకే చర్చల కంటే పరిష్కారాలను పరిశీలించడం మేలు. తద్వారా వారిలోకి చొచ్చుకెళ్లవచ్చు. అయితే ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున ఈ వ్యతిరేకతలను వైసీపీ మళ్ళీ తనవైపు తిప్పుకునే అంశాలను గమనిస్తే అవన్నీ మాసిపోవచ్చు. ఎంతగా చేసినా కొన్ని వర్గాల వ్యతిరేకత తప్పకుండ ఉండొచ్చు. అవన్నీ విపక్షాలు తమకు అనుకూలంగా మార్చుకోగలిగితే కాస్త మెరుగుపడ్డట్టే. చూడాలి ఎవరు ఎంతవరకు అనుకూలంగా మార్చుకుంటారు అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: