దేశంలో శరణార్థులుగా వచ్చిన బంగ్లాదేశీయుల సంఖ్య పెద్దదిగానే ఉన్నాడని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రారంభంలో వాళ్ళు తమ దేశంలో అనేక పరిస్థితుల కారణంగా ఉండలేక, సరిహద్దుల ద్వారా భారత్ లోకి వచ్చారు. ముందు శరణార్థులుగా ఉన్నారు. అనంతరం ప్రాంతీయ ప్రజలలో కలిసిపోయి, మంచి పేరు తెచ్చుకొని, వాళ్ళ ఇళ్లలోనే పెళ్లిళ్లు చేసుకొని, వాళ్లలో ఒకరైపోయారు. ఇంతలా కలిసిపోయిన వాళ్ళను కనిపెట్టడం కష్టం, తమ దేశాలకు తిరిగివెళ్ళాలని అనడం కష్టసాధ్యం. కానీ ఇందులో కొందరు మాత్రం దురుద్దేశ్యంతో దేశంలో కదలియాడుతున్నారు. అందుకనే ప్రభుత్వం వారిని తమదేశాలకు పంపించేయాలని చూస్తుంది.

ఎవరో కొందరు తప్పు చేస్తున్నారు, వాళ్ళ వలన నిజమైన శరణార్థులకు కూడా కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. పోనీ ఇలా వచ్చేవాళ్ళు వేరే వారి మతతత్వ దేశాలకు వెళ్లడం లేదు. భారత్ లో కి వస్తున్నారు. ఇక్కడ మతతత్వ చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. వీళ్ళను అడ్డుపెట్టుకొని కొన్ని పార్టీలు కూడా ఇస్తానురాజ్యంగా ప్రవర్తిస్తున్నాయి. ఇవన్నీ భవిష్యత్తులో ఎన్నో పెద్ద సమస్యలకు దారితీయనున్నాయి. అవన్నీ కేంద్రం ఆలోచించింది కాబట్టి వారిని వాళ్ళ దేశాలకు పంపడానికి ప్రాంతీయ చట్టం తెచ్చింది. దానిని విపక్షాలు వేరే విధంగా ప్రచారం చేయడంతో అది ప్రస్తుతం పక్కన పెట్టేశారు.

ఏదైనా ఒప్పుకోవచ్చు, ఇప్పటికి అతిథి దేవోభవ అని వచ్చిన వారికి అన్ని సేవలు చేసి, వారిని తృప్తి పరిచి, అనంతరం పంపిచేయాల్సి ఉంటుంది.  కానీ ఇక్కడే వాళ్ళను అట్టే పెట్టుకోలేము కదా. అలా అట్టేపెట్టుకుంటే, ఇక్కడ వారికి ఒకనాడు నిలువ నీడ లేకుండా పోతుంది, అప్పుడు ఎవరు ఆ సమస్యను పరిష్కరిస్తాయి. ఇప్పుడు అడ్డుకుంటున్న పార్టీలు ఏమైనా అప్పటికి ఉంటాయా, ఉన్నా కూడా ఆ సమస్యను తీర్చగలవా! మహా అయితే మేము ఇంత పెద్ద సమస్య అవుతుంది అనుకోలేదండి అని ఒకమాటతో సరిపెడతారు. మొక్కై వంగనిది మానై వంగునా అన్న చందాన, ఇప్పటికే వాళ్ళ దేశానికీ వెళ్ళమంటే వేళ్ళని వాళ్ళు మరో దశాబ్దం తరువాత్త వెళ్తారా! ఇవన్నీ ఆలోచించకుండా ప్రభుత్వం పై కేవలం నిందలు వేయడం మానుకొని, కనీసం జాతీయ భద్రతా విషయాలపట్ల అయినా విపక్షాలు ప్రభుత్వం తో కలిసి పనిచేస్తే బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: