ఒక‌రు ముఖ్య‌మంత్రి మ‌రొక‌రు ఆర్థిక మంత్రి.. ఒక‌రు క‌డ‌ప మ‌రొక‌రు గుంటూరు.. ఇవి కేవ‌లం పేరుకే కానీ ఆ స్నేహం ద‌గ్గ‌ర ఓడిపోయిన‌వి ఎన్నో! రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌రువాత అంత‌టి స్థాయిలో జ‌గ‌న్ కూడా ఎవ్వ‌రితోనూ స్నేహం చేసిన దాఖ‌లాలు లేవు. ఆయ‌న‌కు తోడుగా ఉంటున్న‌వారంతా అంతటి స్థాయిలో మార్గ నిర్దేశం చేస్తున్నారనీ అనుకోలేం. రాజ‌శేఖ‌ర్ రెడ్డిని న‌మ్ముకుని ఆ రోజు కేవీపీ, ఉండ‌వ‌ల్లి లాంటి నేత‌లు త‌మ‌దైన ప్ర‌యాణం సాగించారు. కేవీపీ తెర‌వెనుక శ‌క్తిగా నిలిచారు. మీడియా ముందు త‌న వాగ్ధాటి వినిపించ‌డంలో ఉండ‌వ‌ల్లి సాయ‌ప‌డ్డారు. ఫ్లోర్ వ‌ర‌కూ రోశ‌య్య త‌న‌వంతు సాయం అందించారు. ఇంకా ఎంద‌రెంద‌రో న్యాయ, వైద్య నిపుణులు వైఎస్ రూపొందించిన స్నేహితుల జాబితాలో ఉన్నారంటే అతిశ‌యం కాదు. అప్ప‌టి స్నేహం ఇప్పుడు రాదు. జ‌గ‌న్ నుంచి అలాంటివి, చంద్ర‌బాబు నుంచి అలాంటివి ఆశించ‌లేం కూడా! ఎందుకంటే ఇవ‌న్నీ తాత్కాలిక స్నేహాలు.. తాత్కాలికం అయిన బంధాలు అన్న‌ది బాబు నుంచి జ‌గ‌న్ వ‌ర‌కూ అంతా న‌మ్మే సిద్ధాంతం. అందుకే రాజ‌శేఖ‌ర్ రెడ్డి స్థాయిలో జ‌గ‌న్ ఉండ‌రు ఉండ‌లేరు కూడా! త‌ప్పో ఒప్పో చంద్ర‌బాబు కూడా ఇదే కోవ‌లో వ్య‌క్తి.. పార్టీ నాయ‌కుల‌కు ఎంత అవ‌స‌ర‌మో అంతే స్థాయిలో వాడుకుని వ‌దిలేసిన దాఖ‌లాలే ఎన్నో! క‌నుక మంచి స్నేహం ఇప్ప‌టి జ‌గ‌న్ నుంచి ఇప్ప‌టి చంద్ర‌బాబు నుంచి అంత‌గా ఆశించడం అత్యాశే!


ఇంకా చెప్పాలంటే ....

స్నేహానికన్న మిన్న లోకాన లేదు అంటారు. ప్రాణప్ర‌ద‌మ‌యిన స్నేహం అంద‌రికీ గొప్ప అనుభూతి ఇస్తుంది. క‌ష్ట‌కాలంలో అండ గా ఉంటుంది. క‌ష్ట సుఖాల్లో తోడుండే స్నేహం కార‌ణంగానే మంచి జీవితాలు మంచి ఆలోచన‌లు ద‌క్కుతాయి కూడా! కానీ రాజ‌కీయా ల్లో స్నేహాలు క‌ల‌కాలం ఉండ‌వు. క‌ల‌కాలం ఉండేందుకు ప‌రిణామాలు కూడా అనుకూలంగా ఉండ‌వు. అనుకూలంగా ఉన్న ప‌రిణా మాలన్నీ కొంత కాల‌మే ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం నిల‌దొక్కుకునేందుకు స‌హ‌క‌రిస్తాయి. ఆయా సంద‌ర్భాల్లో స్నేహాలు జ్ఞాప‌కా లు అవు తాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, కొణిజేటి రోశ‌య్య స్నేహం కూడా అలాంటిదే. ఆయ‌న బ‌తికి ఉన్నంత కాలం పెద్దాయ‌న‌కు విలువ ఇ స్తూనే గ‌డిపారు. 



ఆర్థిక శాఖ అప్ప‌గించి పెద్దాయ‌న దిశానిర్దేశంలోనే బ‌డ్జెట్ ను రూపొందింప‌జేశాక..వాటి అమ‌లుకు త‌న దైన స‌హ కారం అందించారు. రోశ‌య్య‌కూ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న అన్న‌ద‌మ్ముల అనుబంధం ఆ రోజు ఏ విభేదాల‌కు దారి తియ్య‌ని వ్వలేదు. ఇ ప్పుడు అలాంటి స్నేహం చూడ‌గ‌ల‌మా. వైఎస్ స‌న్నిహితులులో కేవీపీ కానీ రోశ‌య్య కానీ ఇత‌ర నాయ‌కులు కానీ క‌డ‌దాకా ఆయ న తోడే ఉన్నారు. వీలున్నంత మేర మంచి స్నేహాలు నిలుపుకునేందుకు ప్ర‌య‌త్న‌మే చేశారు. ఇప్ప‌టి ప‌రిణా మాల్లో మాత్రం ఇ టువంటి స్నేహాలు ఉంటాయా? ఇప్పుడున్న‌వ‌న్నీ అవ‌స‌రార్థం స్నేహాలు అవ‌స‌రార్థం ప్రేమ‌లు !



మరింత సమాచారం తెలుసుకోండి:

ycp