చాలా రోజులకు తుఫాను వచ్చినా
చాలా రోజులకు ఇబ్బందులు వచ్చినా


ఇవేవీ పట్టించుకోకుండా బాలయ్య అభిమానులే కాదు యావత్ సినీ అభిమానులు అఖండ సినిమా విషయమై చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉన్నారు. నిర్మాతకు  అండగా ఉంటామని చెబుతూనే, ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతున్నారు. మరీ! ఐదు రూపాలకే టికెట్ అమ్మమంటే తామెలా థియేటర్ ను నడపగలమని కొన్ని యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. అయినప్పటికీ ఇదొక సర్కారు నిర్ణయం కనుక అంగీకరిస్తున్నామని అఖండ నిర్మాత రవీందర్ రెడ్డి వినయపూర్వకంగానే చెప్పి హుందాతనం చాటుకున్నారు. తనకు డబ్బులు పోయినా సరే  ఏపీ సర్కారు నిర్ణయం ఒప్పుకుంటున్నానని ఓ సందర్భంలో అన్నారు. ఆ నిర్ణయాల తీరు ఎలా ఉన్నా కూడా బాలయ్య సినిమా అందరికీ నచ్చేసింది. దీంతో పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేందుకు జనం ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా శివతత్వం వినిపించిన తీరు, బాలయ్య సంభాషణలు పలికించిన శైలి ఇవన్నీ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య కూతురు బ్రాహ్మణి అన్న విధంగానే ఏజ్ పెరుగుతున్న కొద్దీ బాలయ్య ఎనర్జీ పెరుగుతోంది. అవును ఇదే నిజం! నూరు పైసల నిజం!

థియేటర్లకు వాటిని నడిపేవారికి ఇంతకుముందు కన్నా మంచి పేరు వస్తోంది. మంచి డబ్బులు కూడా వస్తున్నాయి. కలెక్షన్ల సునామీ అన్నది వస్తే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి ఈ ఆదివారం బాలయ్య అఖండ సినిమా నాలుగు షోలకు గాను మూడు షోలు ఫుల్ అయిపోయాయి. శ్రీకాకుళం జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాలలో ఉన్న థియేటర్లలోనూ అఖండ మంచి విజయా న్ని నమోదు చేసుకుంది.



బాలయ్య అభిమానులు అంతా ఒకటే ఉత్సాహంతో సినిమా చూసేందుకు వస్తున్నారు. జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేశ్ ఎంతో ఆనందంగా ఉన్నారు. తన అభిమాన నటుడి సినిమా అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆయనతో పాటు మొత్తం జిల్లా బాలయ్య అభిమానులు అంతా దర్శకులు బోయపాటికి, నిర్మాత రవీందర్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. తాము ఇంతటి స్పందనను ఊహించలేనేలేదని శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకూ సినిమా గురించి అంతా మెచ్చుకుంటుంటే తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ ఉత్సాహంతో బాలయ్య మరిన్ని మంచి చిత్రాలు, ముఖ్యంగా భారతీయత ఉట్టిపడే కథలు, మన సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చే కథలు ఎంచుకోవాలని వీరంతా మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: