ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వలసల రాజకీయ రంజుగా జరుగుతోంది. నేతలు కూడా నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వస్తున్నారు. వీరికి ప్రజా ప్రయోజనాలు ఎంత మాత్రం పట్టడం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలు ... తమ సొంత ప్రయోజనాలు మాత్రమే పడుతున్నాయి. ఐదేళ్ల పాటు ఒక పార్టీలో అధికారం వెలగబెట్టిన నాయకులు ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి మరో పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే ఆ పార్టీలోకి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో కూడా పదవులు అనుభవిస్తున్నారు. అయితే కొందరికి మాత్రం కాలం కలిసి రాక ఒక పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు... పార్టీ మారాక మాయం అయిపోతున్నారు. ఈ లిస్టులో మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఫ్యామిలీ కూడా ఉంటుంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు ఆయన మంత్రిగా అటు రాష్ట్రంతో పాటు .. ఇటు జిల్లాలోనూ చక్రం తిప్పారు. వైశ్య‌ సామాజిక వర్గం లోనూ ఆయన మంచి పట్టు సాధించారు. గత ఎన్నికల్లో ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన వ్యాపారాలపై జరుగుతున్న దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆయన తన తనయుడు సుధీర్ బాబు తో కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు.

అయితే ఇప్పుడు వైసీపీలో వారిని పట్టించుకునే నాథుడే లేరు. చివరకు జిల్లాలో కాదు కదా కనీసం ఆయన ఏ నియోజకవర్గంలో కూడా వేలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో శిద్ధా ఎమ్మెల్యేగా ఉన్న దర్శి నియోజకవర్గంలో ఇప్పుడు రెండు గ్రూపులు ఉన్నాయి. అసలు వచ్చే ఎన్నికల్లో శిద్ధా రాఘవరావు తనయుడు సుధీర్ బాబు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ప్రకాశం జిల్లాలో ఒక నియోజకవర్గం అంటూ వీరికి లేకుండా పోయింది.

అసలు ఇప్పుడు వైసీపీ నేతలు వారిని పట్టించుకోవడం లేదు. ఏదేమైనా టిడిపిలో ఒక వెలుగు వెలిగి పార్టీ మారిన ఈ తండ్రి కొడుకులు ఇప్పుడు వైసీపీలో ఎవరికీ కొరగాకుండా పోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: