'ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరలా తీసుకు వస్తామంటున్న రాజధాని బిల్లులో ఏమి ఉంటుందో.. ఎలా ఉంటుందో చూడాలి. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే రాజధాని ఉండాలి... అమరావతి రైతులు రాజధాని కోసం పోరాడుతున్నారు. వారికి మద్దతు తెలిపేందుకుకే నేను వచ్చాను' .. అని విశ్రాంత పోలీసు అధికారి, సి.బి.ఐ పూర్వపు జేడీ లక్ష్మీ నారాయణ అమరావతి రైతు యాత్రలో పాల్గోన్న సందర్భంలో పేర్కోన్నారు.  పరిపాలనా వికేంద్రీకరణ పైనే ఆయన ప్రసంగం సాగింది. ..'ట్రాన్స్ పోర్టు క్యాపిటల్' , 'ఆక్వా క్యాపిటల్'.. ఇలా చాలా క్యాపిటల్స్  అవసరమన్నారాయన.  ఆ విషయాలను కాస్త పక్కన పెడితే..
  పాద యాత్ర నిర్వాహకులు  తమ యాత్ర చివరి గమ్యం చేరుకునే లోపల తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించ నున్నారు. అమరావతి పై  ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం  తీసుకు వచ్చిన చట్టాన్ని వెనక్కి తీసుకున్న  ప్రభుత్వం , తరువాత మరలా బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమరావతి నే ఏకైక రాజధానిగా ఉంటాలని రైతులు చేస్తున్న ఉద్యమం ఎలా ఉంటుందో నన్న ఉహాగానాలు వచ్చాయి. అయితే చేస్తున్నది తిరుపతి యాత్ర కనుక  పాదయాత్ర కొనసాగించాలని రైతులు ఒక దశలో పేర్కోన్నారు.  మరికొందరు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి తమకు అనుకూలంగా బిల్లు ప్రవేశ పెట్టేంత వరకూ  నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని ప్రకటించారు. ఏది ఏమైనా న్యాయ స్థానం నుంచి దేవస్థానం అంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర 36 వ రోజు నెల్లూరు జిల్లాలో సాగుతోంది. డిసెంబర్ పదహారు, పదిహేడు తేదుల కల్లా వీరు చిత్తూరు జిల్లా తిరుపతి కి చేరుకోనున్నారు.  వీరు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్టేడియం లో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ స్టేడియంలో తాము సభ నిర్వహించుకునేందుకు కేటాయించాలని వారు అభ్యర్థించారు. ఈ మేరకు యూనివర్సిటీ పాలక మండలికి దరఖాస్తు చేసుకున్నారు.  ఇంత వరకూ  యూనివర్సిటీ పాలక మండలి ఏ విషయం తేల్చ లేదు.
 గత కొన్ని సంవత్సరాలుగా  యూనివర్సిటీ స్టేడియం ను ఇతరులకు, బహిరంగ సభలకు  ఇవ్వడం లేదు.  ఇటీవల టిటి డీ నిర్వహించిన గో - మహా సమ్మెళనానికి కూడా యూనివర్సిటీ పాలక మండలి స్టేడియం ను అప్పగించ లేదు.  టిటిడి  విజ్ఞప్తిని కూడా సున్నితంగా త్రోసిపుచ్చింది.  అయితే అమరావతి రైతులు మాత్రం  తాను నిర్వహించే బహిరంగ సభకు స్టేడియం కేటాయించాలని పట్టుబడుతున్నారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల చేత  వర్సిటీ పాలక మండలిపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. మరో వైపు అమరావతి రైతులు బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి లేదని పోలీసులు పేర్కోంటున్నారు. వారికి కేవలం యాత్ర వరకే అనుమతులున్నాయని వారు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ రెండు అంశాలపై అమరావతి రైతులు తిరిగి కోర్టుకు వెళ్లనున్నారు.
-----



మరింత సమాచారం తెలుసుకోండి: