అంబేద్కర్ ను అవమానించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షమాపణ చెప్పాలని, రెండు రాష్ట్రాల భవన్లో కమిషనర్లను సస్పెండ్ చేయాలని మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి సంఘ స్థాప‌కుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్‌.అంబేద్కర్ ను తెలుగు రాష్ట్రాల‌ అధికారులు మరిచిపోయార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం ముందు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ నిరసన చేపట్టారు.


అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ లలో అంబేద్కర్ విగ్రహానికి ఇరు రాష్ట్రాల అధికారులు అంజలి ఘంటించలేద విమ‌ర్శించారు. కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా శుభ్రం చేయలేద‌ని అన్నారు. ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కి దళితులు గుర్తుకు వస్తారా అని ప్ర‌శ్నించారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో దళిత బంధు, మూడెకరాల భూమి గుర్తుకొస్త‌ది అని అన్నారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం వల్లనే అధికారులు ఈ విధంగా వ్యవహారిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ కి అవమానం జరిగింది అంటే అది మొత్తం సమాజానికి అవమానం జరిగినట్లు అని తెలిపారు.


   అంబేద్క‌ర్ వ‌ర్థంతి సంద‌ర్భంగా నివాళుల‌ర్పించిన ప్ర‌ముఖులు..

   తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళ్ల‌ర్పించి మాట్లాడారు.. అంబేద్క‌ర్ ఆలోచ‌న‌లు ఆద‌ర్శ‌నీయం అని కొనియాడారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు నాయ‌కులు, నేత‌లు పాల్గొన్నారు. అలాగే, హ‌న్మ‌కొండ‌లోని అంబేద్క‌ర్ సెంట‌ర్‌లో నివాళుల‌ర్పించారు మంత్రి ఎర్ర‌బెర్రి ద‌యాక‌ర్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్ కూడా నివాళుల‌ర్పించారు. నిత్య చైతన్య మూర్తి డా.అంబేద్కర్ అని ఆయ‌న చూపిన మార్గంలోనే న‌డుస్తామ‌ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. `నేను ఆరాధించే గొప్ప సంఘ సంస్క‌ర్త‌ల్లో డా.బిఆర్ అంబేద్క‌ర్ ఒక‌రు` అని అన్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాల‌యంలో అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: