రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు వలసపోవడం  ఇప్పుడు సర్వ సాధారణమైన విషయంగా మారిపోయిన‌ది. అయితే దీని వెనుక ప్రలోభాలు, బెదిరింపులు ఇలా ఒక్కటేమిటి..?  అనేక కారణాలతో నేతల పార్టీ కండువా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక అధికారంలో ఉన్న పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం.. పదవులు, డబ్బు ఎర వేయడం లాంటివి త‌రుచుగా వింటుంటాం.  వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న త‌రుణంలో  పంజాబ్‌లో ఇది ఇప్ప‌టికే ఆరంభం అయిపోయిందని తెలుస్తోంది. దీనికి కారణం ఆమ్‌ఆద్మీ పార్టీ పంజాబ్‌ అధ్యక్షుడు, ఎంపీ భగవంత్‌ మాన్  తాజాగా బీజేపీపై సంచలన ఆరోపణలు చేయడమే అని తెలుస్తున్న‌ది.

 ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో చేరాలంటూ తనపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు ఎంపీ భగవంత్‌ మాన్.    బీజేపీలోకి రావాలని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరూ తనకు డబ్బు ఆశ కూడా చూపారని..  అదేవిధంగా కేంద్ర క్యాబినెట్‌లో  కూడా చోటు  కల్పిస్తామని చెప్పారంటూ ఆరోపణలు చేసారు. తాజాగా  మీడియాతో మాట్లాడిన భగవంత్‌ మాన్ బీజేపీకి చెందిన ఓ సీనియర్‌ నేత.. నాతో మాట్లాడార‌ని,  పార్టీలో చేరేందుకు మీకు ఏమి కావాలి? డబ్బులేమైనా కావాలా.. మా పార్టీలోకి వస్తే కేంద్ర కేబినెట్‌లో కావల్సిన పోస్టు ఇస్తామని ఆయన తనను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేసారంటూ ఆరోపించారు.

సమయం వచ్చినప్పుడు సదరూ బీజేపీ నేత పేరును కూడా బయటపెడతానని చెప్పారు ఎంపీ భగవంత్‌ మాన్. పంజాబ్‌లోని ఆప్‌ ఎమ్మెల్యేలకు కూడా బీజేపీ నేతలు గాలం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్న‌ద‌ని మండిపడ్డ ఆయన.. తాను ఎవరికీ అమ్ముడుపోయే వ్యక్తిని కాదని పేర్కొన్నారు.  పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న‌ అంతర్గత‌ విభేదాలతో సీఎం పదవీకి రాజీనామా చేసిన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్.. కొత్త పార్టీ పెట్టి.. బీజేపీతో పొత్తుకు సిద్ధమ‌య్యారు.  ఇక మరోవైపు పంజాబ్‌పై ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ కూడా పెట్టిన‌ది. ఇప్పటికే పలు వాగ్ధానాలు కూడా చేసారు. పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ మ‌రొక‌సారి  అధికారాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్న‌ది. దీంతో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు చాలా ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: