అణు ఆయుధాలు చేయడంలో ఇరాన్ కు ఉన్నంత ఉత్సాహం మరో దేశానికి ఉండదేమో అన్నంతగా ఆ దేశం వాటిని తయారీ చేపడుతుంది. రెండో ప్రపంచ యుద్ధంలో దాని ప్రభావం చుసిన దేశాలు అణు ఆయుధాల తయారీపై స్వీయ నియంత్రణ చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. అయినా కొందరు వాటిని తయారు చేస్తూ, దాచుకుంటూనే ఉన్నారు. వాళ్లకు కోపం వచ్చినప్పుడు తయారు చేస్తారు, ఎప్పటికైనా పనికొస్తాయని నిల్వ చేస్తున్న వారు కొందరైతే, మరి కొందరు చక్కగా అమ్మేసుకుంటున్నారు. అలా ఈ భయానక ఆయుధం గనుక తీవ్రవాదుల చేతిలోకి వెళితే పరిస్థితి ఏమిటి అనేది ఆయా ప్రపంచ దేశాలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

ఎప్పుడు ఇరాన్ పై ఆంక్షలు పెడుతూ వస్తున్న అమెరికా కూడా ఎన్నో అణు ఆయుధాలను పలు భూగర్భ ప్రాంతాలలో నిల్వచేసిన విషయం ప్రపంచానికే తెలుసు. అయినా తనను మరో దేశం మించిపోకూడదని ఇరాన్ పై ఆంక్షలు పెడుతూనే ఉంది. ఒకప్పటి గల్ఫ్ యుద్ధంలో ఇదే అమెరికా ఇరాన్ తరపున యుద్ధం చేసింది. అప్పటి నుండి దానికి ఉన్న శక్తియుక్తులను గ్రహించి, ఆంక్షలు పెడుతూనే ఉంది. తాజాగా చైనా కూడా అమెరికాను మించిపోయేంతగా అణు ఆయుధాలను నిల్వచేస్తున్నట్టుగా శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టం చేసింది. తాము చేసిన నిల్వల గురించి మాట్లాడారు కానీ, ఇతర దేశాల మీద ఆంక్షలు పెట్టడంలో మాత్రం వీళ్లు ముందు ఉంటారు. అలాగని ఇరాన్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని  కాదు, ముందు తాము మానుకొని, పక్క వాళ్లకు నియంత్రణ గురించి సలహాలు ఇస్తే బాగుంటుంది అనేది ఆయా దేశాలకు తెలియాల్సిన కనీస విజ్ఞత.  

ప్రస్తుతం మరోసారి ఇరాన్ తనపై ఆంక్షలు ఎత్తివేయాలని యూరోపియన్ దేశాలను కోరుతుంది. అందుకు వాళ్ళు ఇప్పటికే యురేనియం శుద్ధి చేసుకున్నది ఎక్కడ ఉంచబడింది చెప్పటంలేదు, మరి ఇప్పుడు అసలుకే ఆంక్షలు ఎత్తివేస్తే ఇంకెన్ని అణు ఆయుధాలు సిద్ధం చేస్తారో అనే ఉద్దేశ్యంతో, నమ్మకం లేదని సూటిగా చెప్పేశాయి ఆ దేశాలు. తాజాగా అమెరికా తో గిల్లికజ్జాలు ఆడుతున్న చైనా, ఇరాన్ తో ముందుకు వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. బహుశా అది అణు సంబంధిత ఒప్పందాలే అయిఉంటాయి. అందుకే మరోసారి ఆంక్షలు ఎత్తివేయాలని ఇరాన్ కోరుతుండవచ్చు. చైనా తన అణు సామర్ధ్యాన్ని ఇంకా పెంచుకునేందుకు ఇలా పావును కదుపుతోందా అన్న అనుమానము ఈ సందర్భంగా రేకెత్తడం సహజం.

మరింత సమాచారం తెలుసుకోండి: