పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేల వైఖరిపై గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీరియస్ గా ఉన్నారని ప్రచారం జరుగుతూనే ఉంది. పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కొన్ని కొన్ని అంశాలలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్న పక్షాలతో కలిసి ముందుకు వెళ్లే అవకాశం ఉన్నా సరే కొంతమంది ఎంపీలు సహకారం అందించడం లేదని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు అలాగే వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసే ప్రచారానికి సంబంధించి వైసీపీ ఎంపీలు దూకుడుగా మాట్లాడకపోవడం కూడా ముఖ్యమంత్రి జగన్ లో ఆగ్రహానికి కారణం గా చెప్పాలి.

ఎంపీలు తమ తమ నియోజక వర్గాల సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయక పోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది అంశంగా చెబుతున్నారు. చాలా మంది వైసీపీ ఎంపీలు ఈ మధ్యకాలంలో పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు అని ఢిల్లీ లో ఉన్నా సరే కనీసం కేంద్ర మంత్రులను వ్యక్తిగతంగా అయినా సరే కలిసి తమ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు లేకపోతే రాష్ట్రానికి వలన సమస్య అని చెప్పకపోవడం జగన్లో అసహనానికి కారణంగా ఉందని అంటున్నారు.

చాలా మంది వైసీపీ ఎంపీలు బెంగళూరు లేదా హైదరాబాదులో ఉండటం లేదా ఢిల్లీ వెళితే వ్యక్తిగత వ్యాపార వ్యవహారాల గురించి కొంత మంది బిజెపి నాయకులతో చర్చలు జరిపి తర్వాత పార్లమెంట్ సమావేశాలకు తూతూ మంత్రంగా హాజరు కావడం అనేది కాస్త ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే మాత్రం కొంత మంది ఎంపీల నియోజకవర్గాల ఇన్చార్జిలు నిర్మించే ఆలోచనలో కూడా ముఖ్యమంత్రి జగన్ అన్నారని ఇదే కొనసాగితే మాత్రం కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా కొందరికి వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: