ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇటీవల కాలంలో కొన్ని కొన్ని విషయాల్లో కాస్త దూకుడుగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి కొంత మంది మంత్రుల మీద కూడా కాస్త సీరియస్ గానే ఉన్నారు అనేది అర్థం అవుతుంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం కావడానికి కొన్ని కొన్ని అంశాలను టార్గెట్గా చేసుకోవడంతో పాటు కొంత మంది వైసీపీ నాయకులు కూడా టార్గెట్ చేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా కొంతమంది చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీలో కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి కొంత మంది కీలక నాయకులు ఈ మధ్యకాలంలో దూకుడుగా మాట్లాడటమే కాకుండా భారతీయ జనతా పార్టీతో స్నేహం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయడం అదే విధంగా ఢిల్లీలో ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని దగ్గర చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పై నివేదిక ఇవ్వడం అదే విధంగా కొంతమంది అధికారులు మాట్లాడుతున్న మాటలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ తో పాటుగా ఇతర పార్టీలు చేయడం వంటివి కాస్త చిరాకు గా మారిన అంశాలుగా చెప్పాలి.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సంబంధించి కొన్ని కొన్ని అంశాల్లో వైసిపి నాయకులు దూకుడుగా ముందుకు వెళ్లకపోవడం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బాగా ఇబ్బంది పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నా సరే చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం విపక్షాలు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టారు లేకపోవడం కూడా జగన్ ఆగ్రహం పెరగడానికి కారణమవుతున్నాయి అని అదే విధంగా అమరావతి ఉద్యమానికి సంబంధించి కొన్ని కొన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లలేకపోయారు అని ఆవేదన జగన్ ను ఎక్కువగా ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: